ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా

Chandrababu Naidu gave conformation on beach festival in Vishaka

ఏపిలో విశాఖ తీరంలో బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించడానికి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. దీని మీద ఇప్పటికే అన్ని పక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బి.జె.పితో సహా అన్ని పార్టీలు కూడా ఈ బీచ్ ఫెస్టివల్ ను వ్యతిరేకిస్తున్నారు. బికినీలను చూసి వచ్చే పెట్టుబడులు తమకు వద్దంటూ బిజెపి ఎమ్మెల్యే విష్ణు కుమార్ అన్నారు. ఇక వైసీపీ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు సర్కార్ ఆలోచన మీద దుమ్మెత్తిపోస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా అయితే ఖచ్చితంగా ఈ బీచ్ లవ్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వెల్లడించారు. అంబటి రాంబాబులాంటి సీనియర్ నాయకుడు కూడా బీచ్ లవ్ పేరుతో సంస్రృతికి వ్యతిరేకంగా సాగించాలని భావిస్తున్న కార్యక్రమానికి ఖచ్చితంగా వ్యతిరేకం అని ప్రకటించారు. కాగా బోండా ఉమా రోజా మాటలకు స్పందించారు. రోజా అనుకుంటున్నట్లు ఎలాంటి అసభ్య దృశ్యాలకు తావులేదని అన్నారు. కాగా తొలిసారి ఈ అంశంపై ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

తాను అనుకున్నట్లుగానే విశాఖ తీరంలో బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించితీరుతానని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణను కొందరు అపహాస్యం చేసేలా ప్రకటనలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను మొదటి నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే వ్యక్తినని చంద్రబాబు నాయుడు సెల్ఫ్ డబ్బాకొట్టుకున్నారు. మొత్తానికి చెప్పిన ప్రకారం తాను బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించడం మాత్రం ఖాయం అని తేల్చేశారు. చూడాలి మరి దీనిపై ప్రతిపక్షాలు,స్వపక్ష నాయకులు ఏమంటారో?!

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
జగన్ అన్న.. సొంత అన్న
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
నారా వారి నరకాసుర పాలన
ఏపీకి ఆ అర్హత లేదా?
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
500 నోటుపై ఫోటో మార్చాలంట
వంద విలువ తెలిసొచ్చిందట!
డబ్బు మొత్తం నల్లధనం కాదు
బస్సుల కోసం బుస్..బుస్
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments