దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట

Chandrababu Naidu got thirteenth rank in Modis survey

ప్రధాని మోదీ గుట్టు చప్పుడు కాకుండా చేయించిన సర్వేలో ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. మొదటి స్థానంలో ఉండాల్సిన బాబు ఏకంగా 13వ స్థానానికి ఎలా వెళ్లారో తెలియక తలలు బద్దలు కొట్టుకున్నారట తెలుగు తమ్ముళ్లు. మొదటి స్థానంలో నిలవాల్సిన ‘చంద్రబాబు’ను అవినీతి కాటేసిందని అందరూ అనుకుంటున్నారట. ముఖ్యమంత్రి స్థాయిలో అవినీతి లేకపోయినప్పటికీ మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీ నాయకులు ఈ రెండు సంవత్సరాల్లో ఇరవై ఏళ్లు ఖర్చుపెట్టినా తరగనన్ని ఆస్తులను చాలా మంది సంపాదించారని.. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసట. కానీ అవినీతి ఇంత తీవ్రంగా కాటేస్తుందా? అని బాబు మధనపడిపోతున్నారట.

ఏ నియోజకవర్గానికి వెళ్లినా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కన్నా చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు,నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిలు అవినీతిలో మునిగితేలుతున్నారట. చిన్నపాటి బదిలీ చేయాలన్నా గతంలో ఎమ్మెల్యేల అనుమతి కావాల్సిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. గతంలో అవినీతికిపాల్పడిన అధికారులే కీలక పోస్టులకు పార్టీ నాయకుల సిఫార్సులతో వచ్చారు. ప్రతి సిఫార్సుకో రేటు…ఆ రేటుకు వారు ఒప్పుకుంటే వెంటనే లిఖిత పూర్వకంగా సిఫార్సు చేస్తున్నారు. ఇవన్నీ ఆఖరు నిమిషంలో బాబుకు తెలిస్తున్నాయట. అప్పటికే జరగవల్సిన నష్టం జరిగిపోయింది.

అనేక గ్రామాల్లో అధికారపార్టీ నాయకుల్లో ఎక్కువ మంది విపక్షాల నాయకులతో కుమ్మక్కై వాటాలు వేసి దోచుకుంటున్నారట. పత్రికలు కూడా ఈ అవినీతిపై ఎటువంటి కథనాలు ప్రచురించకపోవడంతో అంతా సాఫీగా ఉందని చంద్రబాబు అనుకున్నారట. దేశ స్థాయిలో నెంబర్‌వన్‌ స్థాయిలో ఉండవల్సిన చంద్రబాబు 13వ స్థానానికి వచ్చారంటే అది కేవలం అవినీతి వల్ల తప్ప మరేమీ కాదని పలువురు సీనియర్‌ అధికారులు అనుకుంటున్నారట. అయినా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంది అంటే చచ్చిపోయిన ఆవు పగిలిపోయిన కుండ నిండ పాలిచ్చింది అన్నట్లుంది. ఆవు చచ్చిపోయింది.. కుండ పగిలిపోయింది.. అంతా హుష్ కాకి.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
సైన్యం చేతికి టర్కీ
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
బావర్చి హోటల్ సీజ్
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
బెంగళూరుకు భంగపాటే
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments