తొక్కితే తాటతీస్తారు

chandrababu vs Jagan

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ చేస్తున్న యాత్రలు, ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న సభలు చంద్రబాబుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. దాంతో నిద్రలో కూడా జగన్ గురించే ఆలోచిస్తున్నారు అని ప్రతిపక్ష నాయకులు జోకులు పేల్చుకునేంత వరకు వెళ్లింది వ్యవహారం. అసలే బ్యాడ్ టైం నడుస్తున్న చంద్రబాబు నాయుడు జగన్ ఫాలోయింగ్ చూసి కంగారులో ఓ మాట అనేశాడు. అయితే చంద్రబాబు నాయుడులాంటి సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడటం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏం అన్నారు అని అనుకుంటున్నారా..? వైయస్ జగన్ నిర్వహిస్తున్న యువ భేరిలకు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది యువతీ యువకులు జగన్ కు అనుకూలంగా యువభేరీల్లో పాల్గొంటున్నారు. తమ ఆలోచనలను జగన్ తో పంచుకుంటున్నారు. అయితే జగన్ చాపకింద నీరుగా వస్తున్నారని, యువత జగన్ కు ఎక్కడ ఫిదా అవుతుందో అని ఆలోచించిన చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా హోదా మీద రంకెలేస్తే జైలుకు పంపిస్తా అని పుసుక్కున నోరు జారారు.

14440844_1062446523852153_3127570943729294881_n

జగన్ మీద అభిమానంతో, ఏపికి ప్రత్యేక హోదా కావాలని గట్టి ఆకాంక్షతో జగన్ నిర్వహిస్తున్న యువ భేరీలకు యువత పెద్ద ఎత్తున పాలుపంచుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఓ రకంగా వారిని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. యువతను జగన్ చెడగొడుతున్నాడు.. ఆయన ఓ నేరస్థుడు ఆయన సభలకు పిల్లలను పంపించడం ఏంటి..? మీ పిల్లల్ని కంట్రోల్ లో పెట్టుకోండి లేదంటే కేసుల్లో ఇరుక్కుంటారు అని ప్రభుత్వం నుండి బెదిరింపులు రావడం ఏపిలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గమనించాల్సిన అంశం ఒకటి ఉంది.. ఎంత వత్తిడికి లోనైతే బంతి అంత ఎత్తుకు ఎగురుతుంది. జగన్ ను చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే.. అంతకంతకు ఎదిగిపోతున్నారు. మరోపక్క యువతను ముఖ్యంగా విద్యార్థలను తొక్కితే మాత్రం ఎన్నికల్లో తాటతీస్తారు. మరి చంద్రబాబుకు ఆ మాత్రం తెలుసో.. తెలియదో..!

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
ఇదే జగ‘నిజం’
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పవన్ మాస్టర్ స్కెచ్
ఆ అరుపులేంటి..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
మూడింటికి తేడా ఏంటి..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?

Comments

comments