ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu graph fall down

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి దారుణంగా మారింది. ఒకప్పుడు పూలమ్మిన చేతులే కట్టెలు అమ్ముతున్న చందంగా మారింది. అయితే చంద్రబాబు నాయుడు అంత దారుణంగా మారారా..? అంటే అది కాదు మ్యాటర్. గతంలో ఆయనకు ఉన్న చరిష్మాకు, ఇప్పుడు ఉన్న చరిష్మాకు తేడా అలాంటిది అని చెబుతున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు నారా చంద్రబాబు నాయుడు దూకుడు మీద ఉండేవాడు. తెలుగుదేశం వర్గాల్లో చంద్రబాబును మించిన నాయకుడు వేరే లేరు అనే బలమైన భావనను క్రియేట్ చేశారు.

పరిస్థితులు ఏవైనా కానీ నాడు తెలుగుదేశం అధినేత నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సిఎంగా మారారు. అప్పుడే చంద్రబాబు నాయుడు చరిష్మా బాగా పెరిగింది. టి. అంజయ్య శంకుస్థాపన చేసిన హైటెక్ సిటికి మరిన్ని భూములను చేర్చి హైదరాబాద్ కు మంచి మార్కెట్ తెచ్చారు అనే పేరు వచ్చింది. అప్పుడే ఎన్నో కంపెనీలు హైదరాబాద్ బాట పట్టడం ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దాంతో బాబుగారి గ్రాఫ్ బాగా పెరిగింది. ఇక బిల్ క్లింటన్ ను హైదరాబాద్ తీసుకువచ్చినప్పుడు చంద్రబాబు పేరు నేషలన్ లెవల్ లో మారుమోగింది.

వాజ్ పేయ్ హయాంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. నాటి ఎన్డీయే కూటమికి నమ్మిన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి మార్కులు కొట్టేశారు. ఇక అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో కూడా బాబు చాలా కీలకంగా వ్యవహరించారు. జిఎంసీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ చేసిన ఘనత కూడా బాబుకే దక్కింది. ఇక జన్మభూమి కార్యక్రమం, ఆడ బిడ్డలకు సైకిళ్లు లాంటి వినూత్న పథకాలతో ప్రజల్లో చంద్రబాబుకు మంచి పేరు వచ్చింది. కానీ రైతులను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల తొమ్మిదేళ్లు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి ముఖ్యమంత్రిగా మారారు. అయితే ఈసారి అధికారంలోకి రావడం చాలా విచిత్రంగా జరిగింది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది అని చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఓట్లేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బాబు వైఖరి బాగా మారింది. అంతేకాకుండా గతంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు మంచి పేరు వస్తే.. ఈసారి మాత్రం చెడ్డపేరు వస్తోంది. అవశేష ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటారు అని అనుకున్న చంద్రబాబు నాయుడు తమను నిలువునా ముంచాడు అని చాలా మంది భావిస్తున్నారు.

అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలను ఇచ్చారు. ఏపిలో ఉన్న పరిస్థితుల దృష్యా తనకు ఓట్లు రావాలంటే హామీలు ఇవ్వక తప్పనిసరిగా మారి బాబు రకరకాల హామీలను ఇచ్చారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని అన్నారు. డ్వాక్రా గ్రూప్ లోని మహిళలకు కూడా రుణాలు మాఫీ చేసితీరుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా అన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిని తుంగలో తొక్కారు. ఏ వర్గానికి న్యాయం చెయ్యలేదు.

ఇక ముందు నుండి అనుకున్నట్లు ప్రత్యేక హోదా మీద కేంద్రం మాట మార్చింది. అధికార బిజెపి పార్టీతో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఎందుకు వెనక్కి తగ్గారు అని అందరికి ఆగ్రహంగా ఉంది. మోదీతో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మేలు కలిగించే పనులు చేసుకుంటారు అనుకుంటే మాత్రం అలా జరగలేదు. ఇక కాపులకు ఇస్తామన్న కాపు రిజర్వేషన్ల మీద కూడా చంద్రబాబు సర్కార్ కు ప్రజల్లో మచ్చవచ్చింది.అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి చంద్రబాబు నాయుడు తన చుట్టూ ఉన్న వాళ్లు చేస్తున్న దురాగతాలను అడ్డుకోలేకపోతున్నారు. మంత్రులు తమ హవా కొనసాగిస్తున్నారు. మంత్రుల కొడుకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద చేయి చేసుకుంటున్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు మాత్రం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఓటుకు నోటు, కాల్ మనీ, రిషితేశ్వరి ఆత్మహత్యలాంటివి కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతను పోగేశాయి.

చంద్రబాబు నాయుడు గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది అని చెప్పడానికి చాలా ఆధారాలే ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబుకు అందిన ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు అని తేలింది. ఇక అన్నింటికి మించి సొంత కోడలు నారా బ్రాహ్మణి నిర్వహించినట్లు చెబుతున్న సర్వేలో అధికార తెలుగుదేశం పార్టీకి కేవలం 57 సీట్లు మాత్రమే వస్తాయని తేటతెల్లమైంది. యవతకు ఉద్యోగావకాశాలను కల్పించడంలో చంద్రబాబు పూర్తిగా విఫమయ్యారు. దాంతో చంద్రబాబు నాయుడు సర్కార్ వైఖరిని, ప్రత్యేక హోదా మీద బాబు నిర్లక్ష్యం మీద యువత మండిపడుతున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు అంతకంతకు దిగజారి చివరకు ప్రజల చేత ఛీ..కొట్టించుకుంటున్నారు అన్నది మాత్రం వాస్తవం.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
సింధూరంలో రాజకీయం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ప్రత్యేక హోదా లాభాలు
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
మోదీ భజన అందుకేనా?

Comments

comments