చెత్త టీంతో చంద్రబాబు

Chandrababu Naidu have Wrost cabinet

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయోమయ పరిస్థితిని ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు చేసిన మొదటి తప్పు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మంత్రుల ఎంపిక. చేవలేని వారిని మంత్రులుగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. బాబు కేబినెట్ లో ఒక్కరంటే ఒక్కరు కూటా సమర్థవంతంగా తమ విధులను నిర్వహించడం లేదు. టీం అంటే అందరూ కలిసి ఆడితేనే.. కానీ ఆట చేతగాని వాళ్లతో టీం తయారు చేసి.. ఆడమని అంటే ఎలా..? అసలు ఏపి కేబినెట్ లో మంత్రుల స్థితి ఏంటి..? దానితో ఏపి పరిస్థితి ఏమిటి..? అన్న దానిపై ప్రత్యేక ఆర్టికల్.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తన సహచర మంత్రులతో కలిపి పెద్ద కేబినెట్ నే తయారు చేసుకున్నా… అందులో పక్కాగా పని చేసే వాళ్లే లేరు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి హోంమంత్రి కూడా పెద్దగా ప్రభావం చూపలేరు అంటే పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అప్పుడెప్పుడో ఏపి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ‘పిఎ’ అని చెప్పి ఓ వ్యక్తి దందాలకు దిగడం సంచలనం రేపింది. సాక్షాత్తు హోంమంత్రి పేరుతోనే దందా చేసినా.. ఏమిచెయ్యలేని నిస్సహాయ స్థితి చినరాజప్పది.

Also Read:  ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’…. ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు

హోంమంత్రి పరిస్థితి అలా ఉంటే.. చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ అనిపించుకుంటున్న పి.నారాయణ అయినా తన పనితనంతో ఆకట్టుకుంటున్నారా..? అంటే అదీ లేదు. ఆ మధ్యన అమరావతి భూముల సేకరణ టైంలో మాత్రం కాస్త మీడియాలో కనిపించిన అయ్యవారు.. ఆ తర్వాత వచ్చిన అవినీతి ఆరోపణలతో కనిపించకుండాపోయారు. అమరావతి భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, భూములను నారాయణ మింగేస్తున్నారని ఆ మధ్యన ఆరోపణలు వచ్చాయి.

పోనీ నారాయణ పరిస్థితి అలా ఉంటే అంతో కొంతో పేరున్న అచ్చెన్నాయుడు అయినా పర్‌ఫెక్ట్ అని అనుకుందామా..? అంటే అదీ లేదు. కేవలం అసెంబ్లీ సమావేశాల టైంలో తప్ప మరెప్పుడూ అయ్యవారు కనిపించరు. కనీసం శాఖ మీద పూర్తి పట్టు ఉంది.. అని అనుకోవడానికి కూడా వీలులేదు. అయ్యలు ఇలా ఉన్నారు అంటే కనీసం అమ్మలైనా సమర్థులా అంటే అదీ కాదు. మంత్రి పీతల సుజాత అయితే ఏకంగా నగదుతో దొరికింది అని.. అవినీతి మరక ఉంది. ఇక పరిటాల సునీత అయితే కేబినెట్ లో ఉన్నా లేనట్లే లెక్క.

విశాఖపట్నం నుండి అన్ని పార్టీలు తిరిగి తిరిగి తెలుగుదేశంలో చేరిన గంటా శ్రీనివాస్ అయినా సరిగ్గా పనిచేస్తున్నారా.? అంటే అయ్యగారి పనితనం ఏంటో రిషితేశ్వరి కేసులోనే తేలిపోయింది. పోనీ వీళ్లకంటే తెలియదు సీనియర్ అయిన యనమల రామకృష్ణుడైనా కేబినెట్ లో కీ రోల్ చేస్తున్నారా..? అంటే అసలు అసెంబ్లీలో తీర్మానాలకు, కేబినెట్ లో చంద్రబాబు పక్క సీటుకు తప్ప ఎప్పుడూ, ఎక్కడా కనిపించడు యనమల. మరి ఆర్థిక మంత్రిగా ఏదైనా ముద్ర వేశారా..? అంటే ముద్ర కాదు కదా మిగిలిన మంత్రుల పనితీరు కంటే దారుణం.

సరే.. ఏపి సర్కార్ లో వాయిస్ ఎక్కువ ఉన్న దేవినేని ఉమా అయినా చంద్రబాబు కేబినెట్ లో బెస్ట్ అనుకుందామా అంటే.. అస్సలు లేదు. సాగునీటి ప్రాజెక్టుల మీద అయ్యవారు ఏపి వాదనను వినిపించడంలో విఫలమయ్యారు. కేవలం మీడియా ముందు మాట్లాడటం తప్ప.. శాఖ మీద లెక్కలు, బొక్కలు కూడా తెలియదు అని చాలా మంది భావన. ఇక కిమిడి మృణాలిని, పైడికొండల మాణిక్యాల రావు, సిద్ధా రాఘవరావు, గోపాలకృష్ణరెడ్డిలాంటి వాళ్లు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉన్నారు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇక వాళ్లు ఏమాత్రం పనిచేస్తుంటారో అందరికి ఓ అంచనా వచ్చేసింది. ఇక మంత్రికాని లోకేష్ మాత్రం ఆటలో అరటి పండులా మారాడా అని అనిపిస్తోంది. పార్టీ బాధ్యతలే సరిగ్గా చెయ్యలేని వ్యక్తి.. కేబినెట్ మీటింగ్ లో కూర్చున్నా చేసేదేముంది అని జోకులు కూడా పేలుతున్నాయి అంటే లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అనుకుంటా.

ఏపిలో పరిస్థితి గందచిందరవిందరమేళంగా మారింది. కేబినెట్ లోని మంత్రులతో సమర్థవంతమైన పాలనను అందించాల్సిన చంద్రబాబు నాయుడు తన టీం ఎంపికలో చేసిన తప్పుతో ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారు. అందుకే చాలా మంది మంత్రులు కేవలం ‘మంత్రులు’ అన్న పేరు వరకు మిగిలిపోతున్నారు. మరి టీం బాగోలేకపోతే ఎక్కడి నుండి గెలుపు వస్తుంది. చంద్రబాబు దేశదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా..  చివరకు ఏపిలో మాత్రం ప్రజల మెప్పుపొందేలేకపోతున్నారు. చంద్రబాబు దేశం వదిలివెళితే కనీసం పలానా మంత్రి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల సమర్థుడు అని చెప్పడానికి వీలులేదు. మరి మంత్రుల స్థితి ఇలా ఉంటే ఏపి పరిస్థితి ఎలా ఉంటుందో.. ఈపాటికే ఓ అంచనా వచ్చి ఉంటుంది కదా.

దేశంలోనే అవినీతిలో నెంబర్ వన్ స్టేట్‌గా, అప్పుల్లో నెంబర్ వన్ స్టేట్‌గా ఈ చెత్త టీం ద్వారా చంద్రబాబు నాయుడు సాధించిన ఘనత. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి, క్యాబినెట్‌ని రీషఫిల్ చేసి, ఎకౌంట్‌బులిటీతో పనిచేయిస్తే.. రాష్ట్రం గాడిలో పడే అవకాశాలు ఉన్నాయి.

Related posts:
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఆ అద్భుతానికి పాతికేళ్లు
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
జీఎస్టీ బిల్ కథ..
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
చంద్రుడి మాయ Diversion Master
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
పట్టిసీమ వరమా..? వృధానా..?
మద్యల నీ గోలేంది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments