నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!

Chandrababu Naidu know Demonetisation jagan said

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలివి తేటల మీద తెలుగు వారికి ఎవరికీ కూడా సంశయం లేదు. ఆయన రాజకీయ చతురత మీద ఎలాంటి సందేహం లేదు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకుంటూపోయిన చంద్రబాబు నాయుడు వేసిన ఓ తెలివైన అడుగును ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ తేటతెల్లం చేశాడు. దేశం మొత్తం డీమోనిటైజేషన్ దెబ్బతో విలవిలలాడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం చాలా తెలివి దాని నుండి తప్పించుకున్నారు. తన ఇన్నేళ్ల సర్వీస్ లో డీమోనిటైజేషన్ పరిష్కారంలేని సమస్యగా మిగిలింది అన్న చంద్రబాబు నాయుడు, తెలివిగా వేసిన పాచికను జగన్ వివరించారు.

నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యలు నడుపుతున్న వ్యాపార కంపెనీల్లో హెరిటేజ్ ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లో హెరిటేజ్ సంస్థ బాగానే విస్తరించి ఉంది. పాలు, పాల ఉత్పత్తులను చేస్తున్న హెరిటేజ్ షేర్ వ్యాల్యూ అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సంస్థను ఫ్యూచర్ గ్రూప్ లో విలీనం చేసి, అందులో వాటా తీసుకున్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. ఆ మెలికను ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ వెల్లడించారు. ఇంతకీ ఆ మెలిక ఏమిటి అంటే..

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడానికి మూడు రోజుల ముందు హెరిటేజ్ గ్రూప్, ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో వచ్చే వాటా కింద నగదును కాకుండా కేవలం వాటా కింద హెరిటేజ్ తీసుకుంది. అయితే ఇదే విషయాన్ని జగన్ వివరించారు. మోదీ తీసుకోబోతున్న నిర్ణయం ముందే చంద్రబాబు నాయుడుకు తెలుసు అని, అందుకే ఆయన తన కంపెనీని అమ్మేసుకున్నారు అని ఆయన అన్నారు. పైగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు హెరిటేజ్ షేర్ వ్యాల్యూ కేవలం 199 రూపాయలు ఉండగా, విలీనానికి ముందు హెరిటేజ్ వ్యాల్యూ 999 రూపాయలు. మరి అంత మంచి వ్యాల్యూ ఉన్న కంపెనీని ఎందుకు అమ్మాలనుకుంటారు? మోదీ తీసుకోబోయే నిర్ణయం ముందే చంద్రబాబుకు తెలుసు కాబట్టి చాలా తెలివిగా ఆయన హెరిటేజ్ ను అమ్మేసి చేతులు దులుపుకున్నాడు అని జగన్ అంటున్నారు. జగన్ చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కదా!

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
కాటేసిందని పాముకు శిక్ష
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
సల్మాన్ ఖాన్ నిర్దోషి
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
జియోకే షాకిచ్చే ఆఫర్లు
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
అడవిలో కలకలం
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
అందుకే భూకంపం రాలేదట
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్

Comments

comments