మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్

Chandrababu Naidu making liquior pradesh

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా పాలన సాగిస్తున్నాడో ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మరోసారి ప్రజల ముందు వెల్లడించారు. సువర్ణ ఆంద్రప్రదేశ్ అవుతుంది అని అనుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సువర్ణం కావడం సంగతి దేవుడెరుగు.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్ గా మారింది అని జగన్ ధ్వజమెత్తారు. విశాఖలో సాగిన సభలో జగన్ చంద్రబాబు నాయుడు సర్కార్ పనితీరును తూర్పాకబట్టారు. జై ఆంధ్రప్రదేశ్ పేరుతో జగన్ నిర్వహించిన ఈ సభకు వేలాదిగా జనాలు హాజరుకాగా, రాష్ట్ర పరిస్థితిని జగన్ వారికి కళ్ళకు కట్టినట్లు వివరించారు.

అవినీతి దగ్గరి నుండి తాజాగా రాష్ట్రం చెయ్యాలని భావిస్తున్న బీచ్ ఫెస్టివల్ వరకు అన్నింటిని జగన్ ప్రస్తావించారు. ఏపికి ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యంగా తన కార్యాచరణను జగన్ అవలంభిస్తున్నారు. చంద్రబాబు హయాంలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. అత్యాచారా ప్రదేశ్‌గా మారిందన్నారు. మహిళల మీద అత్యాచార నిందితుల్లో దేశం మొత్తంలో నలుగురు మంత్రి పదవుల్లో ఉంటే.. అందులో ఇద్దరు మన ఏపీ క్యాబినెట్‌లోనే ఉన్నారని, ఇది మన కర్మ అన్నారు. మహిళలపై అత్యాచారం చేసిన మంత్రుల్లో ఇద్దరు ఏపీ నుంచి ఉన్నట్లు ఏబీఆర్ సంస్థ తెలిపిందన్నారు. వనజాక్షి పైన దాడి జరిగినా కేసు పెట్టరని, రిషికేశ్వరి చనిపోయినా కేసులు ఉండవన్నారు. ఈ రకంగా రాష్ట్రాన్ని ‘అత్యాచార ప్రదేశ్’గా మార్చేశారని అన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో బెల్టు షాపులే లేకుండా చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని తగ్గించకపోగా విపరీతంగా పెంచేసి, రాష్ట్రాన్ని ‘మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని అన్నారు.

ఇక ఏపి సర్కార్ నిర్వహించాలని అనుకుంటున్న బీచ్ లవ్ ఫెస్టివల్ గురించి కూడా జగన్ ఘాటుగా స్పందించారు. బికినీలు వేస్తారట, గంతులు వేస్తారట, ఎక్కడి నుంచో వేలాది ప్రేమ జంటలను తీసుకు వస్తారట, వాళ్ళకోసం గూడారాలు కూడా వేస్తారట అని మండిపడ్డారు. చంద్రబాబు చేసే పనులకు టాడా కేసు పెట్టి జైల్లో పెట్టినా అభ్యంతరం లేదన్నారు. ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితిని కళ్లకు కడుతూ చరిత్రలో జరిగిన ఓ కథను వివరించారు జగన్. రోమన్ రాజకీయవేత్త అయిన జూలియన్ సీజర్‌ను వెన్నుపోటు పొడిచిన ఆయన నమ్మిన బంటు బ్రూటస్ సంఘటనను ప్రస్తావించారు. ఈ సంఘటనను ఏపీ సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రజలకు పోల్చుతూ చెప్పారు. ‘జూలియస్ సీజర్‌ను వెనుక నుంచి ఆయన నమ్మినబంటు బ్రూటస్ కత్తితో పొడిచాడు. ఆ సందర్భంలో సీజర్ బ్రూటస్.. యు టూ అన్నాడు. అంటే, బ్రూటస్ నువ్వు కూడా నమ్మక ద్రోహం చేస్తావా? అని అర్థం. ఈ రోజున అదే పరిస్థితి ఏపీలో జరుగుతోందని అన్నారు. ఎలా అంటే… ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న ప్రజలను చంద్రబాబు కూడా అదేమాదిరి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

చంద్రబాబూ, నువ్వు కూడా నమ్మకద్రోహం చేస్తావా? అంటూ ప్రజలు బాధపడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ గతంలో విశాఖ కేంద్రంగానే చెప్పారని, హోదా అయిదేళ్లు కాదు.. పదిహేనేళ్లు కావాలని దానికి చంద్రబాబు కోరారని, వారు హామీలిచ్చి వెళ్లిన ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచే ప్రత్యేక హోదా కోసం జై ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని జగన్ ప్రకటించారు. మొత్తంగా విశాఖ సభలో చంద్రబాబు నాయుడు సర్కార్ తీరును తూర్పారబట్టిన జగన్.. ప్రత్యేక హోదా మీద మరోసారి విజృంభించారు.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
గెలిచి ఓడిన రోహిత్ వేముల
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
దిగజారుతున్న చంద్రబాబు పాలన
మోదీ ప్రాణానికి ముప్పు
తెలంగాణ 3300 కోట్లు పాయె
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?

Comments

comments