పిట్టల దొరను మించిన మాటల దొర

Chandrababu naidu making too extraordinary words

నారా చంద్రబాబు నాయుడు.. ఏపి రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సిఎంలుగా ఉండి, విభజన తర్వాతి వరకు దాదాపుగా 10 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అధికారాన్ని చేపట్టినప్పుడు చంద్రబాబు మాట తీరు, ఇప్పటి చంద్రబాబు నాయుడు మాట తీరులో చాలా మార్పు వచ్చింది. గతంలో ఆయన మాటలు తక్కువ చేతలు ఎక్కువ కనిపించేవి. ఏం చేసినా సరే చాలా సైలెంట్ గా చేసే వాళ్లు(అది మంచి పని అయినా, చివరకు చెడు అయినా కూడా) కానీ తాజాగా మాత్రం చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చింది.

గతంలో నారా చంద్రబాబు నాయుడు తాను ఏం చేస్తున్నానో మాత్రమే చెప్పేవాడు. కానీ ఇప్పుడు మాత్రం గతంలో తాను గొప్పలు చేశానని చెప్పుకుంటూ లేని తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ ను తెచ్చింది నేనే.. ఫోన్ లను ఇండియాకు తెచ్చింది నేనే.. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే.. అన్నింటికి మూలం నేనే అంటూ తెగ లెక్చర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే తెలుగు తమ్ముళ్లకు కూడా తలనొప్పిగా మారింది. హైదరాబాద్ దగ్గరి నుండి పివి సింధు వరకు అన్నింటికి కారణం తానే అంటూ తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై పార్టీలో కూడా తీవ్రంగా చర్చ సాగుతోంది.

తెలుగుదేశం పార్టీ వల్లే అంతా సాధ్యమైంది.. కేవలం చంద్రబాబు నాయుడు వల్లే అంతా అద్భుతాలు జరుగుతున్నాయి అని తెలుగు తమ్ముళ్లకు తెగ ధైర్యాన్ని నూరిపోస్తున్నా.. పాపం మీడియా మాత్రం దాన్ని వెటకారంగా చూపిస్తోంది. చివరకు చంద్రబాబు నాయుడు కొమ్ము కాసే ఎల్లో మీడియా కూడా దీనిపై ఎలా వార్తలు రాయాలో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు మారాలి.. మారాలి.. అని చెప్పిన నాయకులు ఇప్పుడు ఆయనలో వచ్చిన మార్పును చూసి ఖంగుతింటున్నారు.

పొట్ట కూటి కోసం పిట్టల దొర వేషగాళ్లు.. మాటల కోటలు కడతారు. దిల్లీలో ఎర్రకోట కట్టింది తామే అంటారు… గోల్కొండ కోట మా తాతలది అంటారు.. ఎగిరే విమానంలో వస్తానంటారు.. బంగారు బాతులు ఉన్నాయంటారు. పిట్టల దొరలు చెప్పేవి వందకు వంద శాతం అబద్దాలు అని అందరికి తెలుసు. అయినా కూడా కేవలం తమాషాకి అన్నింటిని విని ఆనందిస్తారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మాటలను కూడా బహుశా అలానే భరిస్తున్నారేమో. అయినా గొప్పలు ఎవరూ చెప్పనప్పుడు కనీసం తనకు తానుగా అయినా చెప్పుకోవాలిగా మరి.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
ఉక్కిరిబిక్కిరి
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
మూడింటికి తేడా ఏంటి..?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?

Comments

comments