ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’…. ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు

Chandrababu Naidu may change five ministers in his cabinet

ఏపిలో చంద్రబాబు నాయుడు  కేబినెట్ లోని మంత్రులకు దడపుడుతోందట. మంత్రుల పనితీరును ఆధారంగా చేసుకొని వారిని కేబినెట్ లో కొనసాగించాలా.? లేదా..? అనే దానిపై చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా ప్రస్తుతం మంత్రి వర్గంలో సాగుతున్న ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకాలని బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు మంత్రి వర్గంలో మార్పులు చెయ్యకున్నా మున్సిపల్ ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా మార్పులు చేస్తారని సమాచారం.

త్వరలో రానున్న ఎన్నికల్లో పట్టు సాధించి పైచేయి సాధించాలని ఇటు టీడీపీ, అటు వైసీపీలు పట్టుదలతో ఉన్నాయి. ఈ స‌మ‌యంలో మంత్రుల‌ను తొల‌గిస్తే ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌భావం ప‌డుతుంద‌ని మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. కాగా త‌రుచు వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రి రావెల కిషోర్‌బాబుపై వేటు ఖాయ‌మ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మ‌హిళా మంత్రి పీత‌ల సుజాత‌ను కూడా వేటు ప‌డే అవ‌కాశం ఉంది. అలాగే మంత్రులు అయ్య‌న్న‌పాత్రుడు, మృణాళిని, రాయ‌ల‌సీమ‌కు చెందిన ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిల‌ను ప‌క్క‌న‌బెట్ట‌నున్నారు.  ఈ ప్రచారంతో ఆ ఐదుగురు మంత్రుల గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో ఆయన సహా 20 మంది ఉన్నారు. మరో ఐదుగురికి అవకాశం ఉంది. ఇప్పుడు అనుకుంటున్నట్టు ఐదుగురిని తప్పిస్తే మొత్తం పదిమంది కొత్తవారికి అవకాశం లభిస్తుంది. దీంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరికి అవకాశం ఇస్తారో తెలియని టీడీపీ శ్రేణులు లెక్కల్లో మునిగిపోయాయి. మరోవైపు సీఎం చంద్రబాబు కూడికలు, తీసివేతల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
గులాబీవనంలో కమలం?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
అహా... అందుకేనా..?!
ఏపిలో జగన్ Vs పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!

Comments

comments