ఆ సిఎంను చూడు బాబు…

Chandrababu Naidu must follow Haryana Chief Minister

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నారు అనే అంశంలో బహుశా దేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ కొట్టేస్తారేమో. ఎన్నికల టైంలో ఎన్నో హామీలనిచ్చిన నారా చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టిన తర్వాత మాత్రం వాటి అమలును గాలికొదిలేశారు.అలాంటి ఎన్నో హామీల్లో నిరుద్యోగ భృతి కూడా ఒకటి. బహుశా ఈ హామీ మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించలేని తరుణంలో నెలకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతిని కల్పిస్తానని బాబుగారు హామీ ఇచ్చారు.

అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గజినీలా మరిచిన చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడంలో విఫలమయ్యారు. పైగా నిరుద్యోగులకు కల్పిస్తామన్న రెండు వేల భృతిని కూడా పట్టించుకోలేదు. కానీ అదే హర్యాణాలో మాత్రం సీన్ వేరేలా ఉంది. అక్కడి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ ఆఫర్ ను ప్రకటించింది. హరియాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హరియాణ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు నెలకు తొమ్మిది వేల రూపాయల భృతిని కల్పించారు.

హరియాణ దేశంలో అభివృద్ధిలో ముందు నుండి కూడా వెనకబడిన రాష్ట్రం. వృద్ధిరేటులో కూడా హరియాణా రాష్ట్రం పెద్దగా లేదు అయినా కూడా అక్కడి నిరుద్యోగులకు నెలకు తొమ్మిది వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసకున్న నిరుద్యోగులు 30 వేల మంది ఉన్నట్లు గుర్తించి, వారికి నెలకు తొమ్మిది వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 324 కోట్లను కేటాయించనున్నారు. హరియాణ సిఎంకు సాద్యమైంది చంద్రబాబు నాయుడుకు మాత్రం సాధ్యం ఎందుకు కావడం లేదు. చిత్తం ఉంటే ఏమైనా సాధించవచ్చు కానీ చిత్తమే లేకుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
‘స్టే’ కావాలి..?
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బెంగళూరుకు భంగపాటే
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!

Comments

comments