ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘

CashforVote2

చూస్తుంటే వైసీపీ టైమింగ్ అదిరింది చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ మీటింగ్ నేపథ్యంలో టిడిపి శ్రేణులు ప్రత్యేక హోదా అంశం వైసీపీ నుండి పవన్ లాగేసుకున్నాడని సంబరాలు చేసుకుంటుంటే.. ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే వేసిన కేసుతో ఓటుకు నోటు మరోసారి తెర మీదకు ఖచ్చితమైన టైంలో వచ్చి.. ఇటు వైసీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. ఇలా ఏపిలో రాజకీయ వేడి పుట్టింది. ఓటుకు నోటు కేసుని పునర్విచారించాలని కోరుతూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏసిబి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాదాపుగాదానిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబేనని ఫోరెన్సిక్ నివేదికలో నిర్ధారణ చేసిన తరువాత కూడా ఆయనని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయని, కనుక ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చి పునర్విచారణకి ఆదేశించాలని వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తన పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని కోరారు. అయితే చంద్రబాబు పేరుని చేర్చాలని ఆదేశించలేదు కానీ సెప్టెంబర్ 29 లోగా ఈ కేసు పునర్విచారణ పూర్తి చేయాలని ఏసిబిని ఆదేశించింది. కనుక తెదేపాకి, చంద్రబాబు నాయుడుకి మళ్ళీ సమస్యలు మొదలైనట్లే భావించవచ్చు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొన్నందునే ఈ కేసు చాలా దూరం వెళ్ళింది. ఇప్పుడు తెలంగాణాలో తెదేపా నుంచి, చంద్రబాబు నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి సవాలు విసరడం లేదు కనుక మళ్ళీ ఈ కేసుని ఏదో ఒక దశలో తొక్కిపట్టినా ఆశ్చర్యం లేదు. కానీ ఈసారి తెదేపాకి బద్దశత్రువైన వైకాపా ఈ పిటిషన్ వేసింది కనుక, ఈ కేసు ఎంత దూరం వరకు వెళుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ కేసు ఇంకా సజీవంగానే ఉందనే సంగతిని చంద్రబాబు నాయుడుకి మరొక్కమారు గుర్తు చేసినట్లుగా భావించవచ్చు. దీనిపై టిడిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అసలే ప్రతిపక్షాల సవాల్లతో చంద్రబాబు నాయుడుకు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఓటుకు నోటు కేసు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది ‘నాయుడు’గారి పరిస్థితి.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
కాటేసిందని పాముకు శిక్ష
బాబోయ్ బాబు వదల్లేదట
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
పోరాటం అహంకారం మీదే
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
2018లో తెలుగుదేశం ఖాళీ!
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
అకౌంట్లో పదివేలు వస్తాయా?
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?

Comments

comments