చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Chandrababu Naidu painful situation with Chiru's Khaidi and Balakrishna's Gauthamiputra shatakarni

అటు వియ్యంకుడు బాలయ్య, ఇటు చిరంజీవి చంద్రబాబును, అతని సర్కార్ ను చిత్రవధకు గురిచేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రత్యర్థులకు ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నట్లుగా ఉంది. వివరాల్లోకి వెళితే.. సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్న ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణిలే ఈ చిత్రవధకు కారణంగా కనబడుతుంది. ప్రత్యర్థులైన వైకాపకు ఇదో అస్ట్రంగా మారింది. ఈ సంక్రాంతి సినిమా సంబరాలు, ఊహించడానికి విచిత్రంగా ఉన్నాయి. జగన్ డిజిటల్ సేన కొత్త ప్రచారం చేపట్టింది. ఈ రెండు సినిమాల కథలు చంద్రబాబుకు చెప్పుదెబ్బల్లాంటివి అంటుంది జగన్ డిజిటల్ సేన.

ఒక పక్క శాతకర్ణి అమరావతి నుండి పాలకుడిగా దేశరక్షకుడిగా, వీరుడిలా పౌరుషంతో భారతదేశం మీసం మెలేస్తుంటే చంద్రబాబు మాత్రం అమరావతి రాజధానిగా పాలన సాగిస్తూ అవినీతిలో ఇరుక్కుపోయి పౌరుషం నశించి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి, రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశాడని జగన్ డిజిటల్ సేన దుమ్మెత్తిపోస్తోంది. మరోపక్క చిరంజీవి ఖైదీ సినిమా. ఈ సినిమా ఆద్యంతం రైతు కోసమే హీరో పోరాటం చేస్తాడని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన నీరు నీరు.. అనే అతి బాధాకరమైన పాట రాష్ట్రంలో రైతు పరిస్థితి కళ్లకట్టినట్లు చూపిస్తోంది. రైతు పక్షపాతిగా రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు, చిత్తశుద్ధిలేని చెత్తటీంతొ చంద్రబాబు పరిపాలనకు సంబంధంలేదని, భూములుపోయి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చంద్రబాబు సర్కార్ ను ఎండగట్టారు.  దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు పన్ను రాయితీ కల్పించి మరీ నెత్తినేసుకుంటున్నట్లంది. ఈ సినిమాలు  విడుదల అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ఏ స్థాయిలో వత్తిడి పెరుగుతుందో చూడాలి.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
బాబు ఏమన్నా గాంధీనా?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments