ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు

Chandrababu Naidu plans to give cellphones to women in Ap

దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఒక్క ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే వస్తుంటాయి. ఏపి రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాల్సిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్వర్తించాల్సిన బాధ్యతను మరిచి లేనిపోని ఆర్భాటాలకుపోతున్నారనిపిస్తోంది. ఇంతకీ బాబుగారు ఏమని ఆలోచిస్తున్నారనేగా.. డిజిటల్ లావాదేవీల కోసం ఏకంగా ఫోన్లను అందించాలనే అద్భుత ఆలోచనతో చంద్రబాబు నాయుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవును అసలు మ్యాటరేంటో మీరే తెలుసుకోవాలి మరి.

రాష్ట్రంలో మొబైల్‌ ఫోన్‌ లేని పేదలకు వాటిని సమకూర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. డిజిటల్‌ లావాదేవీలు చేపట్టడానికి వీలుగా అందరికీ ఫోను సదుపాయం ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, పేదలకు వాటిని సమకూర్చే అంశంపై ఆలోచిస్తున్నామని అన్నారు.రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు మొబైల్‌ బ్యాంకింగ్‌లో ట్రెయినింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరునాటికి ఈ శిక్షణను పూర్తి చేయాలని, 5వేల మందికి శిక్షణనిస్తే వాళ్లు మిగిలిన వారికి శిక్షణ ఇస్తారన్నారు.

రాష్ట్రంలోని 90లక్షలమంది డ్వాక్రా మహిళల్లో 70లక్షల మందికి బ్యాంకు ఖాతాలు, 20శాతం మందికి రూపే కార్డులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ‘పసుపు కుంకమ’ కింద ఇస్తున్న 3 వేలను మహిళలు రూపే కార్డుల్లో వేసుకోవాలని సూచించారు. డ్వాక్రా సభ్యుల ఇంటింటికీ వెళ్లి మొబైల్‌ బ్యాంకింగ్‌ వైపు మళ్లేలా చైతన్యపరచాలని సూచించారు. సెర్ప్‌, మెప్మా విభాగాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగదురహిత లావాదేవాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలను నియమించాలని ఆదేశించారు. దీనిపై విమర్శకులు మరోలా స్పందిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు లేనిపోని ఆర్భాటాలకుపోతున్నారని, అసలే ఖజానా ఖాళీగా ఉందని, అలాంటి టైంలో ఇలాంటి నిర్ణయాలు మరింత చేటుచేస్తాయని అంటున్నారు. అయినా పక్క రాష్ట్ర మంత్రి ప్రజలకు చిల్లర కావాలని, వెంటనే కేంద్రానికి లేఖ రాశారని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అందరికి భిన్నంగా పెద్దప్లాన్ తో వస్తున్నట్టున్నాడు మరి.

Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
వీళ్లకు ఏమైంది..?
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
జగన్ సభలో బాబు సినిమా
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
అకౌంట్లో పదివేలు వస్తాయా?
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments