దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది

Chandrababu Naidu plans to send Nara Lokesh to Delhi

మాటలు కోటలు దాటుతున్నా.. కాళ్లు గడపదాటలేదు అంటే ఖచ్చితంగా ఇదేనేమో. ఏపిలో ఓ వెలుగు వెలుగుతాడు అని అనుకున్న నారా లోకేష్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఏపిలో జగన్, తెలంగాణలో కేటీఆర్ ముందు లోకేష్ ఎందుకు పనికిరావడం లేదు. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు ఆలోచన చూస్తే మాత్రం అందరికి నవ్వొస్తుంది. అదేంటి అంటారా..? లోకేష్ ను దిల్లీకి సాగనంపాలని అనుకుంటున్నారట. సాగనంపటం అంటే మరోలా అనుకోకండి.. అది స్వామి కార్యం కోసమే.

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు ఎంతో ముందుచూపుతో తన కుమారుడు నారా లోకేష్‌ని ఢిల్లీకి పంపిస్తున్నారు. ఢిల్లీ నుంచే లోకేష్‌ ఇకపై కార్యకలాపాలు నిర్వహిస్తారట. దీనికోసం లోకేష్‌ అవసరాలకు తగ్గట్టుగా ఢిల్లీలో భవనాన్ని కూడా ఫైనల్‌ చేయడం జరిగింది. అయితే ఇదేమీ ఉన్నపళంగా తీసుకున్న నిర్ణయం కాదట. ఎంతో కాలంగా ఆలోచించీ చించీ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

రాజ్యసభ కోటాలో ఢిల్లీకి చంద్రబాబు, తన కుమారుడ్ని పంపుదామనుకున్నా కుదరలేదు. అలా వెళితే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని బాబు ఆశించారు. అది కుదరకపోయేసరికి చంద్రబాబు వ్యూహం మార్చారట. ఢిల్లీలో ఏం జరుగుతోందో తన కుమారుడే పరిస్థితుల్ని పరిశీలించి, విశ్లేషించి తనకు సమాచారం అందించేలా ఆయన వ్యూహాలు రచించారని సమాచారమ్‌. ఢిల్లీలో కంభంపాటి రామ్మోహనరావు ఉన్నప్పటికీ ఆయన్నుంచి చంద్రబాబుకి తగిన సమాచారం రావడంలేదట. కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి కూడా సరైన సమాచారం ఇవ్వడంలేదని చంద్రబాబు ఆవేదనతో ఉన్నారు. లోకేష్‌ అయితే జాతీయ స్థాయిలో రాజకీయాల్ని గమనిస్తాడని, తద్వారా తనకు పూర్తి సమాచారం అందుతుందని, భవిష్యత్తులో మూడో కూటమి ప్రయత్నాలకూ ఇది అనువుగా ఉంటుందని చంద్రబాబు వ్యూహం రచించినట్లుగా తెలియవస్తోంది. చంద్రబాబు వ్యూహాలు ఇలాగే ఉంటాయి.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
తెలుగుదేశంలో ఆగష్టు భయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న

Comments

comments