బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?

Chandrababu Naidu Playing Assembly Politics

ఎలెక్షన్లు ఇప్పట్లో లేనప్పటికీ.. ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు పోటాపోటీన నిలుస్తున్నాయి. ప్రతిపక్షం చేసే ఒత్తిడి తట్టుకోలేక, చంద్రబాబు చేసే జిమ్మిక్కులు అన్నీఇన్నీ కావని తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై చేసే ఒత్తిడిని తట్టుకోలేక చంద్రబాబు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌ని రంగంలోకి దించారు. అదేవిధంగా ముద్రగడ కాపు రిజర్వేషన్ కోసం ప్లాన్ చేసిన బహిరంగ సభకు చెక్ పెట్టడానికి పవన్‌తో మరో సభను కాకినాడలో ప్లాన్ చేశారు.

ఇదిలావుంటే.. ఓటుకు నోటు కేసులో వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందిస్తూ విచారణకు ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై చంద్రబాబు నాయుడు హైకోర్టులో స్టే తెచ్చుకోగలిగారు. అన్నీ ఆధారాలతో ఉన్న ఈ కేసుపై విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకోవడం ఏంటని వైకాపా ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఇది ఇప్పుడు అసెంబ్లీలో ఖచ్చితంగా రచ్చ అవుతుంది.

ఇటీవల జరిగిన రాజకీయ ఎత్తులు గమనించినట్లైతే.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల్ని, మీడియాను, ప్రతిపక్షాల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు, ముద్రగడ బహిరంగ సమావేశానికి ముందు తుని ఘటనను ప్రభుత్వం తిరగదోడింది. ఆ సంఘటన జరిగిన 8 నెలల తరువాత దానికి సంబంధించి లేదా అనుమానం ఉన్న వ్యక్తులపై ఎంక్వైరీ నోటీసులు జారీ చేసింది. దీనికితోడు ఎంక్వైరీ తర్వాత కొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. మూడురోజుల అసెంబ్లీ సమావేశాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తాయని అనిపిస్తోంది.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
నిలదీస్తున్న జననేత
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments