చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Chandrababu Naidu presented Dawoos Maya

ఏపిలో బాబుగారి బ్యాచ్ చేస్తున్న అతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దావోస్ లో చంద్రబాబు నాయుడు లేకుండా ఒక్క పని కూడా జరగదు. చంద్రబాబు గురించి తెలుసు కాబట్టే దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం భేటీకి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది అని ఓ వర్గానికి వంత పాడే మీడియాకు చిక్కెదురైంది. పచ్చ మీడియా దాచి పెట్టిన పచ్చి నిజాలను సోషల్ మీడియా ఎండగట్టింది. దావోస్ లో బాబుగారు చేసిన షోయింగ్ మొత్తం బయటపడింది. నిన్నటి దాకా దావోస్ లో సెమినార్ ఇస్తున్న బాబు, ఆకట్టుకున్న బాబు, లేచిన బాబు, కూర్చున్న బాబు ఇలా అని వార్తల మీద వార్తలను… sorry సుత్తివార్తలను జనాల మీదకు వదులుతూనే ఉన్నారు. అయితే పాపం అయ్య వార్ల పప్పులుడకలేదు. బాబుగారు దావోస్ గారడీ మొత్తం బట్టబయలైంది.

ముందు నుండి మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలిసిన చంద్రబాబు ఈసారి అలానే చేస్తూ దొరికిపోయారు. దావోస్ ప‌ర్య‌ట‌న చేసి.. వరల్డ్ ఎక‌నామిక్ ఫోరంలో విదేశీ నిధుల‌ను ఇబ్బ‌డి ముబ్బ‌డిగా రాబ‌ట్టే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని ప్రచారం సాగింది. అక్కడ బాబుగారికి ఘ‌న‌స్వాగ‌తమ‌ని, ఆయ‌న ప్ర‌జెంటేష‌న్లు వింటూ విదేశీ పెట్టుబ‌డి దారులు ఉబ్బిత‌బ్బిబ్బు అని తెలుగు మీడియాలో ఓ వ‌ర్గంకోడై కూస్తోంది.అయితే అందులో చాలా భాగం అబ‌ద్ధ‌మ‌ని తాజాగా వెల్ల‌డై, దీనికి సంబంధించిన వాస్త‌వాలు సోష‌ల్ మీడియా సాక్షిగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అస‌లు బాబుగారికి దావోస్ లో జ‌రుగుతున్న స‌మ్మిట్‌కు ఆహ్వాన‌మే అంద‌లేద‌ని తేలింది. అవును మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం.

ఆయ‌న దాదాపు బాబుగారికి దావోస్ లో జ‌రుగుతున్న స‌మ్మిట్‌కు ఆహ్వాన‌మే అంద‌లేద‌ని, 6కోట్లు దాకా ఎంట్రీ పాసు త‌దిత‌రాల‌కు వెచ్చించార‌ని వెల్ల‌డైంది. దీని కోసం గ‌త అక్టోబ‌రులోనే ఆర్ధిక‌శాఖ గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్ర‌త్యేక నిధుల‌ను విడుద‌ల చేసింద‌ని స‌మాచారం. ఇప్పుడే కాదు గ‌తంలోనూ అంటే తాను పాలించిన గ‌త తొమ్మిదేళ్ల పాల‌న‌లోనూ దావోస్‌కు ఇలాగే బాబు రాక‌పోక‌లు సాగించారు. అయితే అప్ప‌ట్లో అదంతా ఆయ‌న ఘ‌న‌త‌గా మీడియా ప‌చ్చ‌క‌ళ్ల‌ద్దాల‌ను జ‌నానికి తొడిగేసింది. దానిని తొల‌గించి నిజాలు చూపించే మ‌రో మీడియా లేక‌పోవ‌డంతో అదంతా జ‌నం న‌మ్మేప‌రిస్థితి. అయితే ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. ఒక‌టి కాక‌పోతే ఇంకో ప్రింట్ మీడియా లేదా సోష‌ల్ మీడియా… ఉండ‌నే ఉన్నాయి. వాటి పుణ్య‌మాని ఇప్పుడు బాబుగారి బండారం బ‌ట్ట‌బ‌య‌ల‌వుతోంది.

అయినా ఎక్కడికి వెళ్లినా ఎంతో కొంత ఫలితం ఉండాలి. అంతేగానీ తాను దూరసందులేదు మెడకేమో డోలు అన్నట్లు.. అసలే కష్టాల కడలిలో ఉన్న ఏపికి చంద్రబాబు నాయుడు పర్యటనలు తలకు మించిన భారంగా మారాయి. అసలే ఆర్థికలోటు ఉన్న బడ్జెట్.. ఓ దశలో జీతాలు కూడా చెల్లించలేము అనే పరిస్థితి. అయినా కూడా రూపాయి పెట్టుబడి రాని దానికి కోట్లకు కోట్లు ఖర్చు చేసి డబ్బాకొట్టుకోవడం ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే చెల్లింది అనే వార్త వినిపిస్తోంది. అయినా చంద్రబాబు నాయుడుకు ఎవరూ సాటిరారు అనే విషయాన్ని మరోసారి దావోస్ ద్వారా నిరూపించాడు.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
ఏపిలో జగన్ Vs పవన్
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

Comments

comments