నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu said he cant deal the situation

ఏపి ముఖ్యమంత్రి పరిస్థితికి అద్దంపడుతోంది ఈ టైటిల్. హుదూద్ తుఫాన్ లాంటి ప్రకృతి విపత్తును కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఎదుర్కున్న ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చెయ్యడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు తనవల్ల పరిపాలన కావడం లేదు అనే సందర్భంలో వాడి ఉంటారు అని అనుకుంటున్నారేమో కానీ కాదు. మోదీ దెబ్బతో కుదేలైన రాష్ట్ర పరిస్థితిని వివరిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

మోదీ తీసుకువచ్చిన డిమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు)తో దేశంలో కొత్త కలకలం రేగింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ చేసిన ప్రకటన కారణంగా చాలా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి. అయితే దీని వల్ల ఎక్కువగా నష్టపోయింది మాత్రం తమ రాష్ట్రమే అని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇప్పటికే దీనిపై చంద్రబాబు మోదీకి లేఖ రాశారు. ఏపికి వెంటనే పది వేల కోట్ల నగదును సరఫరా చెయ్యాలని ఆయన కోరారు. కాగా మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర పరిస్థితి దారుణంగా మారిందని ఆయన అంటున్నారు. తన రాజకీయ అనుభవంలో ఎన్నడూలేని విధంగా 12 రోజులు దాటినా కానీ చిల్లర సమస్యకు పరిష్కారం లభించకపోవడం ఆశ్చర్యమేస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం తన వల్ల కావడం లేదని ఆయన అంటున్నారు. మోదీ నిర్ణయంతో పరిస్థితి చేయిదాటడంతో చంద్రబాబు నాయుడు చేతులెత్తుశారు.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
స్టే ఎలా వచ్చిందంటే..
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
గాలిలో విమానం.. అందులో సిఎం
తమిళనాట అప్పుడే రాజకీయాలా?

Comments

comments