బాబోయ్ బాబు వదల్లేదట

Chandrababu Naidu said he did not give up Telugudesamparty in Telangana

తెలుగుదేశం పార్టీ.. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన పార్టీ… ఉమ్మడి రాష్ట్రాంలో ఎంతో ప్రాభవం చాటిన పార్టీ. కానీ ఉమ్మడి రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మాత్రం ఏపిలో అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో మాత్రం కనిపించకుండాపోయిన పార్టీ. తెలంగాణలో దాదాపుగా పార్టీకి చెందిన చాలా మంది లీడర్లు కారెక్కారు. ఎర్రబెల్లి దయాకర్ లాంటి సీనియర్లు కూడా కారెక్కడంతో పార్టీ దాదాపుగా ఖాళీ అయింది పైగా ఎన్టీఆర్ భవన్ కు టులెట్ బోర్డ్ పెట్టుకోవాలని ఏకంగా విమర్శలు కూడా వస్తున్నాయంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాను ఆంధ్రా నుండి దిశానిర్దేశం చేస్తున్నానని భావించవద్దని, ప్రతి నెల తెలంగాణ నేతల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటానని చంద్రబాబు తెలంగాణ నేతలతో వ్యాఖ్యానించారు. సొంత నిర్ణయాలతో పార్టీని బలోపేతం చేసుకోవాలని, అంతే కాని ప్రతి దానికి తనపై ఆధారపడవద్దని, తనను అర్థం చేసుకోవాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు సూచించారు. తాను తెలంగాణను వదలలేదని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా అధికారం సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కార్యకర్తలు అధైర్యపడవద్దని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
గుజరాత్ సిఎం రాజీనామా
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
జగన్ అన్న.. సొంత అన్న
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
పిహెచ్‌డి పై అబద్ధాలు
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
తెలంగాణ 3300 కోట్లు పాయె
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
ఉద్యోగాలు ఊస్టింగేనా ?

Comments

comments