‘స్టే’ కావాలి..?

chandrababu-stay

ఓటుకు నోటు కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదిపారు. కోర్ట్ తీర్పు వచ్చిన 24 గంట‌ల త‌ర్వాత బాబు స్పందించారు. ‘ఆ కేసులో ఏముందని మాట్లాడాలి…?’ అంటూ మీడియానే ప్ర‌శ్నించ‌డం విశేషం. ‘కేసు గురించి మీడియా స్ట‌డీ చేసి ఏముందో చెప్పాలంటూ’ స‌ల‌హా కూడా ఇచ్చారు. ‘కేసు వ్య‌వ‌హార‌మంతా మా అడ్వ‌కేట్లు చూసుకుంటార‌ని’ మాత్రం చెప్పారు. దాంతో చంద్ర‌బాబు ఈ వ్య‌వ‌హారంలో ఉన్న‌త‌న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించ‌బోతున్నారా అన్న సందేహం క‌లుగుతోంది. హైకోర్ట్ కి వెళ్లి ఏసీబీ కోర్ట్ తీర్పును స‌వాల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్ప‌టికే దానిపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ప్ప‌టికీ రాజ‌కీయంగా దాని ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న అంచ‌నాకు రాలేక‌పోతున్న‌ట్టు స‌మాచారం.ఈ నేపధ్యంలో ముందస్తు బెయిల్ కోసం కానీ లేదా అరెస్టయిన తర్వాత బెయిల్ కోసం కానీ ప్రయత్నించడం జరిగితే నిప్పని చెప్పుకునే చంద్రబాబుకు తలతీసినట్లవుతుంది. దీని కారణంగా చంద్రబాబు పూర్తిగా కేసుపైనే స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చెయ్యవచ్చు.

కాగా చంద్రబాబు నాయుడు హైకోర్టుకు స్టే అప్పీలుకు వెళ్లడం వల్ల క్రిటిక్స్ కు దీనిపై విమర్శించే అవకాశం ఇచ్చినట్లవుతుంది. అదేమంటే తను ఈ నేరం పరోక్షంగా ఒప్పుకున్నట్లవుతుంది. ఉన్న పళంగా జైలుకు తీసుకెళితే సిఎం పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకొని తిరిగి సిఎంగా పదవి కోసం ప్రయత్నించవచ్చు.  ఓటుకు నోటు కేసులో ఏసీబీకి ఏసీబీ కోర్టు ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను ఏసీబీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. న్యాయ నిపుణులకు ఉత్తర్వుల కాపీలను పంపించామని, అసలు విచారణ ఎప్పటినుంచో చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు మాటలు అందరికి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
సల్మాన్ ఖాన్ నిర్దోషి
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
తెలంగాణకు ప్రత్యేక అండ
పోరాటం అహంకారం మీదే
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
చెరువుల్లో ఇక చేపలే చేపలు
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?

Comments

comments