ఓటమి వైపే చంద్రబాబు అడుగులు

Chandrababu Naidu Steps for Failure

లేనిది ఉన్నట్లుగా, రాబోతున్నట్లుగా చూపించే దిట్ట చంద్రబాబు నాయుడు. ఇదే ఆయన మార్కెటింగ్ ప్రతిభ కూడా. అందుకోసమే ప్రజలు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఏదో ఒక మ్యాజిక్ చేసి ఆదుకుంటారని, ప్రజలు ఆయనకు పట్టంగట్టారు. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక సహాయాన్ని సరిగా ప్రజలకు చెప్పుకపోగా, దానికి సమర్థించుకునే తీరు అందరికి ఆశ్చర్యానికి కలిగిస్తోంది.

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని తెలిసి కూడా సీమాంధ్ర ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రత్యేక హోదా అంటే పెద్ద విషయం కాదన్నట్లు, అది పొందిన రాష్ట్రాలు ఏవీ కూడా స్వర్గధామంగా మారిపోలేదని ఈశాన్య రాష్ట్రాలు ఏం సాధించాయని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ప్రతిపక్షాలకు కానీ. ప్రజలకు కానీ, మేధావులకు కానీ, మీడియాకు కానీ ఈశాన్య రాష్ట్రాల గురించి తెలియనట్లు అవి కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలుగా ఊహించి మాట్లాడటం ఆయనలోని నిరాశ, నిస్ర్పుహ లకు, తెలివితక్కువతనానికి అద్దంపడుతోంది.

14వ ఆర్థిక సంఘం ఏమో ఆంధ్రప్రదేశ్ కు, ఈశాన్య రాష్ట్రాలకు, కొండ ప్రాంత రాష్ట్రాలకు, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకు అసలు పోలికేలేదని, అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక లావాదేవీలు చాలా తక్కువ అని, అందుకే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరంలేదని తేల్చేసింది. మరి అన్ని వనరులు ఉన్న, ఆర్థిక లావాదేవీలు చెయ్యగల ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా ఐదేళ్ల పాటు ఇస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి దేశంలోనే ఈ రాష్ట్రం దూసుకెళ్లిపోతుంది. అది తెలిసి కూడా ఓటమిని అంగీకరించేవాడిగా గెలుపు కోసం ప్రజలను చైతన్యవంతులుగా చెయ్యకుండా మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ధోరణి హక్కుగా భావించే ప్రత్యేక హోదాను గెలుపొందకపోగా ప్రతిపక్షాలకు అవకాశాలిస్తూ 2019 లో జరిగే ఎలక్షన్ లో ఓడిపోయే విధంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Related posts:
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
ఆ అరుపులేంటి..?
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
బాబు Khan
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments