ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే…?!

Chandrababu Naidu stories

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలలు.. కళల గురించి తెలుగు ప్రజలు అందరికి తెలుసు. రాష్ట్ర స్థాయిలో కాదు కేంద్ర స్థాయిలో కూడా గింగరాలు తిప్పగల సమర్థుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం జరిగినా అన్ని తన ఎకౌంట్ లోనే వేసుకుంటూ ఉంటారు. మొన్నామధ్యన సిందు ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ నెగ్గితే తాను వేసిన స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లే అది సాధ్యపడింది అని డబ్బా కొట్టారు. ఇప్పుడు వైసీపీ నాయకుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు స్టోరీలనే సినిమాలుగా చేస్తున్నారని రెండు పాపులర్ తెలుగు సినిమాల పేర్లు చెప్పారు.

చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకొని గజిని, అపరిచితుడు సినిమాలను తెరకెక్కించినట్లు కొడాలి నాని వివరించారు. చంద్రబాబు నాయుడు చేసిన హామీలను మరవడంలో గజినిలాంటి వాడు అని.. ఆయన ఆధారంగానే సినిమా స్టోరీని అనుకున్నారని కొడాలి అన్నారు. అలాగే అపరిచితుడు క్యారెక్టర్ కూడా చంద్రబాబు నాయుడు నుండి వచ్చిందే అని అన్నారు ఆయన. ఎప్పుడు చూసినా తన మీద వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ఒక్క కేసు కూడా నిరూపించలేకపోయారు అని అంటున్నారని.. కానీ వైయస్ దగ్గరికి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి కాళ్లు పట్టుకున్నారని కొడాలి అన్నారు.

నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన మీద పెట్టిన కేసులతో వైయస్ దగ్గరికి వెళ్లాడని అన్నారు. ఇప్పటికే తాను ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యానని.. ఇప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపితే వచ్చేదేముందుది.. కనీసం స్నేహితుడిగా అయినా చూడాలి అని చంద్రబాబు ప్రాధేయపడితే మంచి మనసుతో వైయస్ రాజశేఖర్ రెడ్డి వదిలేశారని అన్నారు. ఇప్పుడు వైయస్ చనిపోయిన తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు తాను నిప్పు అని అంటున్నారని అన్నారు.

ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు ఫోన్ లో మీ వెంట నేనున్నాను.. రేవంత్ రెడ్డి చెప్పినట్లు చెయ్యండి అంటూ మాట్లాడింది చంద్రబాబు నాయుడే అని, ఆయన కేసులో తన పేరు లేకున్నా కూడా కోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకున్నారని అన్నారు. దమ్ముంటే కేసులను ఎదుర్కోవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. ఎవిడాకాళ్లైనా పట్టుకొని కేసుల నుండి అయినా వేరే ఏ అంశం నుండైనా కూడా బయటపడగల సమర్థుడు చంద్రబాబు అన్నారు. దొంగ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని కొడాలి నాని అన్నారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు వెనకాడని వ్యక్తి అని కొడాలి స్పష్టం చేశారు.  అధికారం ఉంటే అహంకారంతో జుట్టుపట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
అతడికి గూగుల్ అంటే కోపం
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
స్టే ఎలా వచ్చిందంటే..
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
వంద విలువ తెలిసొచ్చిందట!
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments