దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు

Chandrababu Naidu trying to implement Swiss challenge

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు స్విస్ ఛాలెంజ్ మీద ఓ అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్న చందంగా చేస్తున్నారు. సిఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో చేపట్టాలని చూస్తున్నారు. స్విస్‌ఛాలెంజ్ విధానంలోనే అత్య‌త్తుమ రాజ‌ధాని క‌డ‌తామ‌ని చంద్ర‌బాబునాయుడు ప‌దేప‌దే ప్ర‌క‌టించారు. గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచారు. సింగ‌పూర్ కంపెనీలు ముందుకు వ‌చ్చాయి. అయితే ముందుగా వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌లు న‌చ్చ‌లేదు. దీంతో మ‌ళ్లీ పిలిచారు. మ‌రికొన్ని కంపెనీలు బిడ్లు దాఖ‌లు చేశాయి. అయితే ఇప్పుడు అక‌స్మాత్తుగా స్విస్‌ఛాలెంజ్ విధానంపై వెన‌క్కు త‌గ్గారు.

మ‌ళ్లీ కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని చెప్పారు. న్యాయ‌ప‌రంగా చిక్కులు త‌ప్పించుకోవ‌డానికి వేసిన వ్యూహ‌మా.. లేక నిజంగానే స్విస్‌ఛాలెంజ్ విధానానికి గుడ్‌బై ప‌థ‌క‌మా అన్న చ‌ర్చ మొద‌లైంది. దీనిపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం ముడుపులు అందుకోవడానికి మాత్రమే స్విస్ ఛాలెంజ్ విధానానికి తెర తీశారని వైసీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ బాబు సర్కార్ వెనక్కి తగ్గలేదని, కోర్టు ఉత్తర్వులతో బెంబేలెత్తిన సర్కార్ దొంగదారిలో పేరు మార్చి స్విస్ విధానాన్ని అమలు చెయ్యాలని చూస్తోందని వైసీపీ నాయకుల వాదన.

ఏం జరిగిందో తెలియదు కానీ గ్లోబ‌ల్ టెండ‌ర్లు విష‌యంలో చంద్ర‌బాబు మ‌న‌సు మార్చుకున్న‌ట్టేనని పార్టీలో బ‌లంగా వినిపిస్తోంది. పార్టీ నుంచీ, బ‌య‌ట ప్ర‌ముఖుల నుంచి వ‌స్తున్న ఒత్తిడి నేప‌థ్యంలో ఆయ‌న మ‌న‌సు మార్చుకున్న‌ట్టు స‌మాచారం. స్విస్‌ఛాలెంజ్ ద్వారా క‌డితే పార్టీని, రాష్ట్రాన్ని న‌మ్ముకున్న కాంట్రాక్ట‌ర్ల‌కు అన్యాయం జ‌రుగుతుందని.. ప‌నులు ద‌క్కే అవకాశం ఉండ‌ద‌ని కొంద‌రు చంద్ర‌బాబు దృష్టికి తీసుకొచ్చారట‌. పైగా పెద్ద‌పెద్ద నిర్మాణాలు చేప‌ట్టిన సంస్థ‌లు చాలానే మ‌న‌దేశంలో ఉన్నాయి. వాటితో గ‌తంలో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. హైటెక్ సిటీ వంటి నిర్మాణాలు చేశాయి. విదేశాల్లో కూడా జిఎంఆర్ వంటి సంస్థ‌లు భారీ ప్రాజెక్టులు చేప‌డుతుంటే అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థ‌ల‌కు ఎందుకు అప్పగించాలి అనే అభిప్రాచం వచ్చిందట.

ఇదే విషయాన్ని వైసీపీ కూడా బలంగా వినిపిస్తోంది. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిన, అనుభవం కలిగిన కంపెనీలు చాలానే ఉన్నాయి.. మరి అలాంటి కంపెనీలను కాదని ముందుగానే అనుకున్నట్లు సింగపూర్ కంపెనీలకు ఎందుకు మొత్తం అంటగడుతున్నారు అని వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. విదేశీ కంపెనీలకు కాంట్రాక్ట్ ను అప్పగించడమే కాకుండా, వారికి భూమిని కూడా కేటాయించాల్సి వస్తోంది. రాజధాని అమరావతి కోసం అంటూ రైతుల నుండి తీసుకున్న విలువైన భూములను ఎందుకు విదేశీ కంపెనీలకు అప్పనంగా కట్టబెడతారు అని వైసీపీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు తాను అనుకున్న కంపెనీలకు స్విస్ ఛాలెంజ్ విధానంలో మేలు చెయ్యడానికి అడ్డదారుల్లో కూడా ముందుకు సాగుతున్నారు అన్నది వాస్తవం.

స్విస్ చాలెంజ్ పద్ధతి అంటే…
ఒక ప్రైవేట్ సంస్థతో మాట్లాడుకొని వారిచ్చే ప్రతిపాదనకు ఒప్పుకొని కాంట్రాక్ట్ ఇవ్వజూపడం. అనంతరం ఇతర సంస్థలను కూడా ఆహ్వానించి అంత కంటే మంచి ప్రతిపాదన ఇవ్వమని అడగడం లేదా మొదటి ప్రతిపాదనలో మార్పులు సూచించమని చెప్పడం. ఇతర సంస్థలు సూచించిన మంచి మార్పు లను అమలు చేయడానికి అంగీకరిస్తే మొదటి సంస్థకే ఆ కాంట్రాక్టు అప్పగి స్తారు. ఇతర సంస్థలు ప్రతిపాదించిన మార్పులను అమలుచేయడం సాధ్యం కాదని మొదటి సంస్థ చేతులెత్తేస్తే ఆ కాంట్రాక్టును వేరే సంస్థకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే, మాస్టర్ ప్లాన్ తయారుచేసిన వారికి దానిలోని మతలబు తెలుస్తుంది కనుక సహజంగానే మాస్టర్ డెవలపర్‌గా తెలివైన ప్రతిపాదనలతోనే ముందు కొచ్చే అవకాశముంది.

అమరావతి విషయంలో ఈ చాన్స్ సింగపూర్ కంపెనీలకు దొరికింది స్విస్ చాలెంజ్ పద్ధతి మన దేశంలో గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో అమలు జరుగుతోంది. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత తక్కువ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ పద్ధతిలో జరిగే పనులకే ఈ విధానం కొంతవరకు అనుకూలం. అక్కడ కూడా ప్రైవేటు సంస్థ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వ్యయం ఎక్కువ అవుతోందని చెప్పినా కాంట్రాక్టు కొనసాగించలేకా, బయటపడలేకా సతమతం కావలసివస్తుంది.

స్విస్ చాలెంజ్ కాంట్రాక్టు తీసుకున్న పెద్ద పీపీపీ (పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్) ప్రాజెక్టులను యూపీఏ ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిధిలోకి తీసుకొని వచ్చింది. పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి అలాంటి వ్యవస్ధ ఆంధ్రప్రదేశ్ లో లేదు. స్విస్ ఛాలెంజ్ అనే కొత్త విధానం ద్వారా చంద్రబాబు నాయుడు అమరావతిలో తన చతురతను ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వ్యతిరేకత ఎందుకంటే..
స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తోందని వైసీపీ ముందు నుండి వాదనను వినిపిస్తోంది. తనవాళ్లకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని, సింగపూర్ కంపెనీలతో కలిసి ఏర్పాటు అమరావతి డెవలప్ మెంట్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని అంటున్నారు. సింగపూర్ కంపెనీలు చేసేవి కేవలం భూముల వ్యాపారం మాత్రమేనని వారి బలమైన వాదన.

సింగపూర్ కంపెనీలకు అన్నివిధాలా మేలు చేసే సౌకర్యాలు కల్పించినా వారు పెట్టే పెట్టుబడులు మాత్రం నామమాత్రమని జగన్ వర్గం అంటోంది. భారతదేశ చట్టాల్లో లేనివిధంగా సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ ఒప్పందాలేవీ భారతదేశ నిబంధనలకు అనుకూలంగా లేవన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ కు.. లాభాలకు సింగపూర్ కు తరహాలో ఒప్పందాలున్నాయన్నారు.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ప్రత్యేక హోదా లాభాలు
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
ఇక యుద్ధమే కానీ..
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments