కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా

Chandrabau-NeetiAyog-New

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే నిధుల కోసం విజయవాడ నుండి దిల్లీకి చక్కర్ల మీద చక్కర్లు కొడుతుంటారు. పైగా కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో నిధులు రావడంలేదనే మాట మాట్లాడుతుంటారు. కానీ కేంద్రం నుండి నిధులు భారీగా వస్తున్నాయని.. వాటిని బాబుగారు తన ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, నిధులను మళ్లించి సొంత అవసరాలకు, రాష్ట్ర ప్రభుత్వం పేరుతో వాడుకుంటున్నారని ఏపి బిజెపి నాయకులు మండిపడుతున్నారు. కానీ దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడటం లేదు. తాజాగా నీతి ఆయోగ్ చంద్రబాబు నాయుడు చేస్తున్న నిర్వాకాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది.

ఏపి పునర్విభజన చట్టం ప్రకారం కొత్త రాష్ట్రం ఏపికి ఎలాంటి నిధులను కేంద్రం మంజూరు చెయ్యడం లేదని చంద్రబాబు నాయుడు మాటవిరుపులు చేస్తుంటారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన2014 చట్టం ప్రకారం నవ్యాంధ్రలో మొత్తం 13జిల్లాలలో బాగా వెనకబడిన 7జిల్లాలకి అందులో ఉత్తరాంధ్ర లో 3జిల్లాలు,రాయలసీమ ప్రాంతంలో 4జిల్లాలుకు అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించటం జరిగింది.దానిలో భాగంగా ప్రతి ఒకజిల్లాకి 50 కోట్లు చొప్పున సవంత్సరానికి 350 కోట్లు ఇప్పటి వరకు గడచిన 2 సవంత్సరాలకి కలిపి మొత్తం 700 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది .

ఇచ్చినదానిలో ఒక్క పైసా కూడా ఆయాజిల్లాలలో అభివృద్ధి కోసం ఖర్చుపెట్టకుండా దారి మళ్లించి, చంద్రబాబు తన పార్టీ మీటింగ్ లకు, ఇతరత్రా అవసరాలకు వాడుకున్నారని నీతి ఆయోగ్ వెలుగులోకి తెసుకొచ్చింది. 700 కోట్లు దారి మళ్లించి కేంద్రం వద్ద మాత్రం మేము 7 జిల్లాలలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాము అని కేంద్రానికి తప్పుడు నివేదిక సమర్పించారు బాబు సర్కార్ . ఆ తరువాత ఇచ్చిన నిధులుపై కేంద్రము దానిమీద విచారణకి అదేశించటం జరిగింది. దీనితో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే నీతి ఆయోగ్ తనిఖీ చేసి ఏడు వందల కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం కాకుండా తమ పార్టీ కోసం ఖర్చు చేశారు తేల్చేసింది. చంద్రబాబునాయుడు లాంటి సీనియర్ నాయకుడు చేస్తున్న ఇలాంటి తప్పుల ప్రభావం రాష్ట్రం మొత్తం మీద, భవిష్యత్ తరాల వరకు ఉంటుంది అనే విషయాన్ని బాబుగారు గుర్తెరుగాలి. అసలే కష్టాల సుడిగుండంలో ఉన్న రాష్ట్రానికి ఇది మరో గుదిబండగా మారుతోంది.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
గులాబీవనంలో కమలం?
తెలుగుదేశంలో ఆగష్టు భయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
ఏపిలో జగన్ Vs పవన్
పంజా విసిరిన జననేత
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఏపి సిఎంగా నారా లోకేష్
ఓటుకు నోటు కేసును మూసేశారా?

Comments

comments