ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన

Chandrababu Naidu what Administration is this

ఏపిలో నారా చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. విభజన తర్వాత తమ కష్టాలు తీరుస్తాడని, రాష్ట్రాన్ని కష్టాల కడలి నుండి ఒడ్డుకు చేరుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రెండున్నరేళ్ల తర్వాత సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు నాయుడు మీద ఎంతో నమ్మకంగా ఓటు వేసిన వాళ్లు.. ఆయన పనితీరుపై అసహనం, ఆగ్రహంగా ఉన్నారు. విభజనలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఎంత నెత్తీనోరూ బాదుకున్నా.. కేంద్రం పట్టించుకోలేదు. అందుకే మోదీతో స్నేహంగా ఉన్న చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని సర్దుకుంటాయి అని అనుకున్నారంతా. కానీ అప్పుడు హామీల హామీలను గుప్పించిన చంద్రబాబు.. ఒడ్డుకు చేరిన తర్వాత తెడ్డును తగలేసినట్లు ప్రజల హామీలను నీరుగార్చారు.

ప్రజలకు అండగా పాలన సాగిస్తాడు అంటే కేవలం అనుయాయులకు అండగా, మందీమాదుగులకు బలంగా మారారు చంద్రబాబు. ఓటుకు నోటు కేసుతో రాష్ట్రం పరువును నడిరోడ్డులో పరువు తీశారు. కేంద్రం ముందు దేహి అని అడ్డుకున్నే పరిస్థితి తీసుకువచ్చారు. తెలంగాణ సర్కార్ చర్యలకు కేంద్రం ముందు తలవంచుకున్నారు. దాన్నే అలుసుగా తీసుకున్న మోదీ ప్రత్యేక హోదాను అటకెక్కించారు. ఏపికి న్యాయం చేస్తాడని అనుకున్న చంద్రబాబు మీద ప్రజలకు ఏరకంగానూ నమ్మకం లేకుండాపోయింది.

ఓటుకు నోటులో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు నాయుడు ఆ కేసు నుండి బయటపడటానికి ఎన్నిసార్లు దిల్లీకి చక్కర్లు కొట్టాడో అందరికి తెలుసు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని తెగ ప్రచారం నిర్వహించిన చంద్రబాబు హయాంలో మహిళలకు రక్షణ కరువైంది. తహశీర్దార్ వనజాక్షి మీద అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినా చర్యలు తీసుకోలేదు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో కూడా కులాల కుంపటి కారణంగా కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆడవాళ్లకు భద్రత లభించాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు సర్కార్ రావాలి అన్న యాడ్ ఎంత ఘోరంగా విఫలమైందో ఈ రెండు ఘటనలు కళ్లకు కట్టాయి. అన్నింటికి మించి కాల్ మనీ వ్యవహారం చంద్రబాబు సర్కార్ కు అతిపెద్ద మచ్చగా మిగలనుంది. ఆడవాళ్ల మానాలతో వ్యాపారాన్ని చేస్తున్న వారికి అండగా ఉండటం ఎంతో మంది మహిళలకు కోపం తెప్పించింది.

బిల్డప్ రాయుడుగా ముందు నుండి పేరున్న చంద్రబాబు నాయుడు చేసిన అతిపెద్ద తప్పుల్లో గోదావరి పుష్కరాల ఘటనను చరిత్ర ఎన్నటికీ మరిచిపోలేనిది. కేవలం మీడియా స్టంట్ కోసం చంద్రబాబు చేసిన పుష్కర స్నానం వల్ల అభంశుభం తెలియని ఎంతో మంది అమాయకులు చనిపోయారు. దీని మీద చంద్రబాబు నాయుడు ఎంతలా కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినా కానీ ఆ ఆవేదనను చంద్రబాబు ఎన్నటికీ తీర్చలేడు. మంచి పాలకుడిగా పరిపాలిస్తాడు అనుకున్న చంద్రబాబే తమ చావుకు కారణమైతే.. ఆ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి.

అన్నింటికి మించి ఏపికి రాజధాని లేదని, మనకు రాజధాని అవసరం అని వేల ఎకరాల పంట భూములను రైతుల నుండి బలవంతంగా లాక్కున్నారు. అమరావతి పేరుతో అన్ని దేశాలు తిరుగుతూ రోజుకో ప్రకటన చేసి.. రాజధానిని అరచేతిలోనే చూపించేస్తున్నారు. సింగపూర్ కంపెనీలకు అమరావతి నిర్మాణాన్ని ధారాదత్తం చేసేశారు. మంత్రి నారాయణ అమరావతి భూముల విషయంలో తన హస్తలాపవాన్ని బాగా ప్రదర్శించారు అని పేరువచ్చింది. కానీ ఎవరి మీద ఎలాంటి చర్యలకు చంద్రబాబు నాయుడు మాత్రం ముందుకు రారు. కేపిటల్ సిటి ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు.? ఎలా నిర్మిస్తారో చంద్రబాబుకే క్లారిటీలేదు. ఓ రోజు సింగపూర్ ను మించిన సిటీ అంటాడు మరోరోజు డల్లాస్ అంటే. మరోరోజు లండన్ అంటాడు. ఇక సచివాలయం నిర్మాణంలో ఉండగానే కుంగడం కూడా బాబుగారి పనీ తీరుకు అద్దంపడుతోంది.

రెండున్నరేళ్లలో తాను ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేకపోతున్నాడు. రైతు రుణాల దగ్గరి నుండి డ్వాక్రా మహిళల రుణాల వరకు ఒక్క రుణాన్ని కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ రద్దుచెయ్యలేకపోయింది.పైగా కొత్త అప్పులు ఇవ్వకుండా సర్కార్ ఎన్ని అడ్డుపుల్లలు వెయ్యాలో అన్నీ వేసేసింది. ఇక జాబు కావాలంటే బాబు రావాలి అన్న దానికి పూర్తి వ్యతిరేకంగా సాగుతోంది. జాబులు లేక నిరుద్యోగ భృతి రాక ఎంతో యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. ఉద్యోగ ప్రకటనలు చేస్తామని ఊదరగొట్టి.. అరకొర పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలల్లో చంద్రబాబు నాయుడు పాలనపై అసంతృప్తి అంతకంతక పెరుగుతోంది. పైగా మరోపక్క ఏపిని అవినీతిలో దేశంలోనే టాన్ లో నిలబెట్టారు చంద్రబాబు. టిడిపిలో ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమా జర్నలిస్ట్ ల పది కోట్ల విలువైన భూములను బొక్కడం, మరో ఎమ్మెల్యే సత్యప్రభ ఏకంగా 43 కోట్ల నగదుతో ఐటీ అధికారులకు దొరకడం  జరిగింది. మొత్తంగా ముగిసిన రెండున్నరేళ్ల గురించి కాకుండా చాలా మంది రాబోయే రెండున్నరేళ్లలో ఏపిలో ఎన్ని విపరీతాలు జరుగుతాయో అని భయపడుతున్నారు. పాపం.. ఏపి ప్రజలను ఆ ఏడుకొండల ఎంకన్న సామే కాపాడాలి.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
ఆ అరుపులేంటి..?
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
బాబు Khan
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
మద్యల నీ గోలేంది..?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
ఇక యుద్ధమే కానీ..
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీ భజన అందుకేనా?

Comments

comments