జగన్ సభలో బాబు సినిమా

Chandrababu Naidu cinema in Jagan Yuva Bheri

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట మార్చిన వైనాన్ని వైసీపీ అధినేత వైయస్ జగన్ కర్నూల్ యువభేరిలో వీడియోలతో సహా నిరూపించాడు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకాలను జగన్ వీడియో ద్వారా కళ్లకు కట్టాడు. నాడు ఓట్ల కోసం ఏ వర్గానికి చెందిన వారిని వదలని చంద్రబాబు నాయుడు నిలువునా ముంచుతున్నాడు అని అన్నారు. బహుశా ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇలా చేసి ఉండరు.. ఇంత దారుణంగా మోసాలకు పాల్పడం ఏంటి అని జగన్ ప్రశ్నించారు.

‘నరేంద్ర మోదీని పక్కనే పెట్టుకుని ఆ రోజు పదేళ్లు కావాలని, పదిహేనేళ్లు కావాల‌ని వెంక‌య్య నాయుడు, చంద్ర‌బాబు ప్ర‌తి స‌భ‌లోనూ చెప్పారు. అధికారంలోకి రాగానే హోదాను వ‌దిలేసి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదాకు ఉద్యోగాలకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదంటూ కొత్త పల్లవి అందుకోవడం మన దౌర్భాగ్యం“ అని జ‌గ‌న్ అన్నారు. ఎన్నిక‌ల ముందు మోడీ, చంద్ర‌బాబు, వెంక‌య్య‌, ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడుతున్నార‌నేది విద్యార్థుల‌కు వీడియో క్లింపుల‌తో స‌హా చూపించారు. ఇలాంటి మోసాలు చేసే వారిని మ‌నం ప్ర‌శ్నించాలి. పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీ సాధించుకునేందుకు అంద‌రం క‌లిసి క‌ట్టుగా పోరాడుదాం. ప్ర‌త్యేక హోదాను సాధించుకుందాం’ అని జగన్ పిలుపునిచ్చారు.

Related posts:
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
సింగ్ ఈజ్ కింగ్
సల్మాన్ ఖాన్ నిర్దోషి
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
‘స్టే’ కావాలి..?
స్థూపం కావాలి
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
చంద్రబాబు చిన్న చూపు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
ట్రంప్ సంచలన నిర్ణయం
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
పాపం.. బాబుగారు వినడంలేదా?
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..

Comments

comments