ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?

Chandrababu Niadu fears after Intelligence Report

ఏపిలో ముఖ్యమంత్రి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్లుంది. గతకొంత కాలంగా ఏపిలో వచ్చిన రాజకీయ మార్పుల కారణంగా చంద్రబాబు ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ముందు నుండి ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన చంద్రబాబు, దాన్ని ఆధారంగా చేసుకొని ఓ రిపోర్ట్ తెప్పించుకున్నారట. ఏపిలో పరిస్థితి మీద ఆయన తెప్పించుకున్న రిపోర్ట్ ను చూసిన తర్వాత మాత్రం తెగ భయపడ్డారట. దాంతో ప్రతిపక్షాలు ఎంతలా వత్తిడి తీసుకువస్తున్నా కానీ అడుగు వెనక్కే వేస్తున్నారు అని తెలిసింది. ఇంతకీ ఏం రిపోర్ట్ తెప్పించుకున్నారు..? ఎందుకు భయపడుతున్నారు ..? అనేగా మీ అనుమానం. అయితే మొత్తం స్టోరీ చదవండి.

అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కాకుండానే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తుందా?. అంటే అవుననే అంటోంది ఇంటెలిజెన్స్ విభాగం. డిసెంబర్ లో జరుగుతాయని చెబుతున్న మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలటం ఖాయంగా చెబుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా గుంటూరు, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్లలో పరిస్థితి టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగాలేదని చెబతున్నారు. ఈ కార్పొరేషన్లు అధికార పార్టీకి దక్కటం కష్టమే అని నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ లో పరిస్థితి ఫిఫ్టీ..ఫిఫ్టీగా ఉందని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి.

మిగిలిన చోట్ల కూడా పరిస్థితి అంత తేలిగ్గా తెలుగుదేశం పార్టీ గెలుపు తీరాలకు చేరే పరిస్థితిలేదని ..కాస్త కష్టపడితే మాత్రం ఫలితాలు మిగిలిన చోట్ల సానుకూలంగా వచ్చే అవకాశం ఉందని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇంటెలిజెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వేలో ఏపీలో 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీకి కేవలం 56 చోట్ల మాత్రమే సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చాయి.  పార్టీ వర్గాలను మునిసిపల్ ఎన్నికలకు సిద్ధం  చేసేందుకే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఈ ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల మంత్రులు..ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related posts:
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
తెలుగుదేశంలో ఆగష్టు భయం
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
స్టే వస్తే కురుక్షేత్రమే
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments