వార్దాకు వణికిపోతున్న చెన్నై

Chennai effected with Vardha cyclone

బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారిపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తీర ప్రాంతాలు తుఫాను భయంతో వణికిపోతున్నాయి. వేగంగా దూసుకొస్తున్న వార్ధా తుఫాను.. చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గంటకు 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెన్నై నగరం మొత్తం అతలాకుతలమైంది. ఇప్పటికే చెన్నై నగరం తుఫాను దెబ్తో అతలాకుతం కాగా తాజాగా వార్దా దెబ్తో చెన్నై చిద్రమైపోయింది. అయితే తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వార్ధా ఎఫెక్ట్ తో.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచేరి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. సహాయ చర్యలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. ముంపు ప్రాంతాల ప్రజల భద్రత విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అవసరమైతే.. ప్రత్యేక శిబిరాలకు జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఇటు.. కేంద్రం ఆధీనంలో ఉండే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా.. సహాయ చర్యలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచేరికి బలగాలు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ.. సహాయ చర్యలు చేస్తున్నాయి. ప్రజలు సహాయ చర్యలకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.

వార్దా దెబ్బతో ఇప్పటికే చెన్నై నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. భారీ వర్షానికి ఐదు జిల్లాల ప్రజలు వణికిపోయారు. తుఫాను ధాటికి 8 మంది చనిపోగా… 16 వేల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సర్కార్ నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, కడలూరు జిల్లాలను తీవ్ర తుఫాను కుదిపేసింది. భారీ వర్షానికి మహా వృక్షాలు సైతం నేల కూలాయి. చెన్నై మొత్తం 2 వేల చెట్లు కూలాయి. ఇళ్ల పై కప్పులు, బోర్డులు.. గాల్లో కొట్టుకుపోయాయి. ఉత్తర చెన్నైలోని సముద్రతీర ప్రాంతాలైన కాశీమేడు, తిరువత్తియూరు, ఎన్నూరు వంటి ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
బాబు గారి అతి తెలివి
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments