ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం

Chevella MP Vishweshwar Reddy clean toilets in A school

మనలో చాలా మంది చెప్పే వాళ్లే ఉంటారు.. కానీ చేసే వాళ్లు చాలా తక్కువ. లీడర్ అనే వాడు వెనకుండి నడిచే వాడు కాదు.. ముందుండి నడిపే వాడు. పలానా పని మీరు చెయ్యండి అని కాదు.. ఇలా చేశాను మీరు కూడా చెయ్యండి అని నిరూపించే వాడు. ఇంత రామాయణం ఎవరి కోసం అనుకుంటున్నారా.? చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గురించి. వామ్మో ఆయన గురించి చెప్పడానికి ఇంత చెప్పాలా అనుకుంటున్నారా..? ఆయన చేసిన పని చూసిన తర్వాత మీరు కూడా ఇంతే ఫీలవుతారు కాబట్టే ముందే రాసేశాం.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్.. గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను క్లీన్ చేసి వార్తల్లో నిలిచారు. చేవెళ్ల మండలంలో 11 టాయిలెట్ క్లీనర్ లను ఏర్పాటు చేశారు ఎంపీ. అలా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ క్లీన్ చేసే వాహనాన్ని తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లి.. స్కూల్లో టాయిలెట్స్ శుభ్రం చేశారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడి.. స్వచ్ఛ భారత్ కు అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలని సూచించారు. బిల్ గేట్స్, ప్రధాని మోడీలు స్వయంగా టాయిలెట్స్ క్లీన్ చేసుకుంటుంటారని… మన టాయిలెట్స్ మనం శుభ్రం చేసుకోవడంలో తప్పులేదన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. ఇలాంటి లీడర్లకు తెలుగోడ చేస్తోంది సలాం.

Related posts:
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
తాగుబోతుల తెలంగాణ!
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
స్థూపం కావాలి
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
నారా వారి నరకాసుర పాలన
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
BSNL లాభం ఎంతో తెలుసా?
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను

Comments

comments