సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది

China fears with India's social media effect

చైనా వస్తువులు కొనకండి.. ఈ దీపావళికి మన దీపాలు వెలిగించండి.. చైనా వస్తువులను బహిష్కరించండి… అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ లు వస్తున్నాయి. యువత దీన్ని చాలా వేగంగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. యురీ ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్ ను కార్నర్ చేస్తే.. చైనా తన మిత్రదేశం పాకిస్థాన్ కోసం భారత్ ను కార్నర్ చేసింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చైనా మీద యుద్ధం మొదలైంది. చైనా వస్తువులను బహిష్కరించడంతో పాటుగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలంటూ తెగ ప్రచారం నడుస్తోంది.

ఈ ఏడాది దీపావ‌ళికి ఎట్టిప‌రిస్థితుల్లోనూ చైనా వ‌స్తువుల‌ను కొనకూడ‌ద‌ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాతోపాటు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు కూడా చైనా వ‌స్తువ‌ులు కొనద్దంటూ భారీ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. దీపావ‌ళి పండుగకు చైనా నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే టపాసులు దిగుమ‌తి అవుతాయి. డెక‌రేష‌న్ సామ‌గ్రి, చివ‌రికి మ‌న దేవుళ్లు గ‌ణ‌ప‌తి, ల‌క్ష్మి విగ్ర‌హాలు కూడా చైనా నుంచే వ‌స్తాయి. దీపావ‌ళి స‌మ‌యంలో ఈ వ‌స్తువులకు గిరాకీ చాలా ఎక్కువ‌.ఈ ఏడాది పండుగ‌కు ఆ వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రించ‌డం వ‌ల్ల చైనాను ఆర్థికంగా దెబ్బ‌తీయ‌డ‌మే కాకుండా.. స్వదేశీ వ‌స్తువుల‌ను కూడా ప్రోత్స‌హించిన‌ట్లు అవుతుందంటున్నారు.

ప్రజలు, వ్యాపార‌స్తులు మాత్రం ఈ బ‌హిష్క‌ర‌ణ‌ను స్వాగ‌తిస్తున్నారు.పాకిస్థాన్‌కు సహకరిస్తున్న డ్రాగాన్ దేశానికి భారతీయులు గట్టిగా బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నారు. చైనా ఉత్పత్తుల భహిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు. మేడ్ ఇన్ చైనా మందుగుండు సామాన్లను కొనుగోలు చేయొద్దంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. ఇందుకు సానుకూలంగా స్పందిస్తున్న జనం.. దేశీ బాణాసంచాలనే కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రభావం ఢిల్లీలోని దీపావళి సామాన్ల విక్రయాలపై ఎక్కువగా కనిపిస్తోంది. దీంతోపాటుగా  ఎలక్ట్రానిక్స్ వస్తువులను కూడా బహిష్కరించాలని చాలా మంది పిలుపునిస్తున్నారు. అయితే మన దేశంలో తయారయ్యే వస్తువుల రా మెటీరియల్ చైనా నుండి దిగుమతవుతోంది కదా మరి దాని గురించి ఏంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే పరోక్షంగా కన్నా ప్రత్యక్షంగా చైనాను ఇలానే దెబ్బతియ్యాలి అని చాలా మంది భావన.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
సింగ్ ఈజ్ కింగ్
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
బాబును వదిలేదిలేదు
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
వాళ్లకు ఇదే చివరి అవకాశం
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments