ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే

two

ఏపిలో పరిస్థితులు దారుణంగా మారాయి. బాబూ మాకు ప్రత్యేక హోదా కల్పించడం అంటూ ఏపి జనాలు రోడ్లెక్కుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద నిప్పులు జల్లుతున్నారు. సహాయం చేస్తాడనుకున్న మోదీ మొత్తానికి హ్యాండిచ్చాడు.. ఇక చంద్రబాబు నాయుడు కనీసం మిత్రపక్షపార్టీగా ఉండి కనీసం పువ్వుకాకున్నా పత్రిఅయినా పట్టుకువస్తారు అనుకుంటే అది కూడా లేదని తేలిపోయింది. ఏపిలో ఇంత గందరగోళం, ఆందోళనలు జరుగుతుంటే ఓ ఇద్దరు మాత్రం చాలా తీరిగ్గా కూర్చున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా.? మెగాఫ్యామిలీ స్టార్ హీరోలు, రాజకీయ నాయకులు చిరంజీవి, పవన్ కళ్యాణ్.

మెగాస్టార్ గా తెలుగు తెరను ఏలిన చిరంజీవి.. గతంలో యుపిఎ ప్రభుత్వహయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. మరి అలాంటి బాధ్యతనిర్వర్తించిన చిరంజీవి ఏపిలో పరిస్థితి అగ్గి మీద గుగ్గిళంలా ఉంటే కనీసం ఓ ప్రకటన లేదు. గతంలో కాపుల ఉద్యమం ఉంటే హుటాహుటిన ప్రకటన చేసి, నాలుగైదు ప్రెస్ మీట్ లలో హడావిడి చేశారు. మొన్నామధ్యన ఓ బిల్ కోసమంటూ సోనియాగాంధీ నుండి పిలుపువస్తే హుటాహుటిన పార్లమెంట్ కు హాజరయ్యారు. మరి ఏపిలో జరుగుతున్న పరిస్థితుల మీద కనీసం ఓ ప్రకటన చేసే తీరిక కూడా చిరంజీవిగారికి లేదా..? అనేది ప్రశ్న.

తన 150వ సినిమా కోసం అని వివి వినాయక్ తో కలిసి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి. చాలా కాలం తర్వాత సినిమాలు చేస్తుండటంతో చాలా ఏకాగ్రతతో దీన్ని అన్ని దగ్గరుండి మరీ చూస్తున్నారు. హీరోయిన్ల సెలెక్షన్, కథలో మార్పులు లాంటి వాటిలో బిజీగా ఉంటే ఏపి ప్రజల కష్టాల గురించి, ప్రత్యేక హోదా గురించి పట్టించుకునే ఓపిక, తీరిక ఎక్కడుంటుంది చెప్పండి. కానీ చాలా మంది మాత్రం చిరంజీవి ఏదో ఒకటి చేస్తాడు అని అనుకోవడం నిజంగా వారి వెర్రితనమే అవుతుంది.

ఇక అన్న అలా ఉన్నాడు.. అన్నకు భిన్నంగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా ప్రత్యేక హోదా విషయంలో ఏదైనా మాట్లాడతారు అంటే అది కూడా లేదు. నీటి మీద మేడలు కట్టడం లాంటిదే ఈ ఊహ. ఆరు నెలలకు వచ్చే ఓ ట్వీట్ లేదా ఓ ప్రెస్ నోట్ మినహా పొలిటికల్ లీడర్ గా పవన్ నుండి అంతకన్నా ఎక్కువ ఆశించడం కూడా ఆశే అవుతుంది. జనసేన పార్టీ పెట్టి ప్రజల తరఫున ప్రశ్నిస్తా అని చెప్పి.. ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టి కనీసం ఏంటో కూడా పట్టించుకోని పరిస్థితి.

పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తన సత్తా చూపిస్తారు.. తన తిక్కుకు లెక్క చూపిస్తాడు.. కేంద్రం మెడలు వంచుతాడు అంటూ కొన్ని మీడియాల్లో భజన మొదలైంది. అంత చేసే వాడే ఉంటే ఇప్పటి వరకు కనీసం మాట్లాడకుండా ఉంటారా..? అనేది కూడా ఆలోచించాలి. అయినా పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ ఎన్ని సార్లు.. ఎన్ని సమస్యల మీద ప్రశ్నించారో చూస్తే వాళ్లు రాస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజాలున్నాయో మనకే అర్థమవుతుంది.

వచ్చే ఎన్నికల్లోపు తాను ఆర్థికంగా నిలబడేందుకు సినిమాలు చేస్తానని పవన్ ప్రకటించడంతో.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఫ్యాక్షన్ బ్యాడ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న పవన్ తన సినిమా వర్క్ మీద బిజీగా ఉన్నాడు. ఏపి మొత్తం ఉడికిపోతున్నా.. ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంట్ లో మన ఎంపీలు గొడవచేస్తున్నా కానీ కనీసం స్పందించరు. ఏదో మమ అనిపించుకునేలా నాలుగు ఘాటు వ్యాఖ్యలు చెయ్యడం కరెక్ట్ కాదు అని చాలా మంది అభిప్రాయం. ఇలా ఇద్దరు అన్నదమ్ములు తమ తమ సినిమాలపై బిజీగా ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో వాళ్లకు ప్రజల సమస్యలపై స్పందిచే తీరిక, ప్రశ్నించే ఓపిక ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి..???

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
జీఎస్టీ బిల్ కథ..
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
సింధూరంలో రాజకీయం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
చెత్త టీంతో చంద్రబాబు
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మెరుపు దాడి... నిజమా-కాదా?
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments