జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే

Chiranjeevi entry to Janasena on that time

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న స్టార్ హీరోల్లో మెగా స్టార్ చిరంజీవి ఒకరైతే, ఆయన సహాయంతో సినిమా రంగంలో నిలదొక్కుకొని ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాల్లో దేవీప్యమానంగా వెలుగుతున్న టైంలో ఉమ్మడి రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ప్రజారాజ్యం అంటూ ప్రజల కోసం సామాజిక న్యాయం అనే కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. తర్వాత పరిస్థితులు తారుమారై ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలపడం జరిగింది. కొన్నాళ్లకు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో ఓ పార్టీని స్థాపించారు. కాగా ఇప్పుడు తమ్ముడి జనసేన పార్టీలోకి చిరంజీవి ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి చాలా కారణాలున్నాయి. అందులో కొన్నింటికి తెలుగోడ విశ్లేషిస్తూ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

జనసేన పార్టీని చిరంజీవి ఏ తరహాలో అయితే స్థాపించారో అదే స్టైల్లో పవన్ స్థాపించారు. ముందు నుండి కూడా స్వతంత్ర భావాలున్న పవన్ కళ్యాణ్ జనసేనకు ముందు ప్రజారాజ్యంలో ఎంతో కీలకంగా ఉన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడి గురించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకుల పంచలూడదీసి కొట్టాలని పవన్ పిలుపునిచ్చారు. చిరంజీవికి అండగా ప్రజారాజ్యానికి మైలేజ్ ఇచ్చేందుకు చిరు ఫ్యామిలీ మొత్తం వెన్నంటి ఉన్నా కానీ పవన్ మాత్రం ఎవరికి సాటిరారు. పవన్ అంటేనే చిరుకు ఓ బలం.

చిరంజీవికి పొలిటికల్ గా కూడా పవన్ ప్లస్ గా నిలిచారు. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన తర్వాత పవన్ కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ చిరంజీవి అంటే పవన్ కు ఎంత అభిమానమో అందరికి తెలుసు. తన అన్నయ్య చిరంజీవి వల్లనే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని.. తన అన్నయ్యకు మించింది ఏదీ లేదు అని కూడా గతంలో చాలా సార్లు అన్నారు. పైగా పొలిటికల్ గా చిరును ఏనాడు పవన్ టార్గెట్ గా చెయ్యలేదు. అలాగే చిరు కూడా జనసేన గురించి కానీ పవన్ గురించి కానీ ఎక్కడా తప్పుగా లేదంటే విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చెయ్యలేదు.

Also Read:  చిరుకు పవన్ అందుకే దూరం

Also Read:  టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?

Also Read:   చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం

ఇప్పుడు జనసేన పార్టీ సంస్థాగతంగా పునాదులు వేసుకుంటోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేనకు పూర్తి పొలిటికల్ పార్టీ రూపురానుంది. మరోపక్క చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ పెద్దగా ప్రాధాన్యత లేదు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసినా, ఓ పార్టీ అధినేతగా ఉన్నా కానీ కాంగ్రెస్ వర్గాల్లో చాలా వరకు ఆయనకు తగిన గౌరవమర్యాదలు లభించడం లేదు అన్నది టాక్. దాంతో ఇప్పుడు తన తమ్ముడి జనసేన వైపు చిరు చూపు పడిందని అందరూ అనుకుంటున్నారు.

గత ఎన్నికల టైంలో పవన్ కల్యాణ్ కు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో లభించిన గుర్తింపు, పొలిటికల్ గా పవన్ లాంటి బలమైన, ఆలోచనాత్మక శక్తితో కలిసి చిరు ప్రయాణిస్తే తనకు కూడా కలిసి వస్తుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు. బహుశా ఈ ప్లాన్ తోనే ముందు నుండి చిరు పవన్ గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ చెయ్యలేదేమో. మొత్తంగా అన్నాదమ్ముళ్లు మరోసారి పొలిటికల్ గా మెరిసే అవకాశాలు లేకపోలేదు. పైగా ఒకరు తెలంగాణను చూసుకున్నా.. మరొకరు ఏపిని చూసుకుంటారు అనే దూరదృష్టితో కావచ్చు. కానీ మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మెగా ఫ్యామిలీ పొలిటికల్ గా మెరిసే అవకాశాలున్నాయి.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
చంద్రబాబు నెంబర్ వన్..
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments