చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు

Chiranjeevi respond in two style on tree plantation

ఆయన మెగాస్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటంలేని మహారాజే అయి ఉండవచ్చు. కానీ అంత మాత్రాన నోటికి వచ్చింది మాట్లాడేస్తాం. ఇష్టం వచ్చిన వాళ్లను పొగిడేస్తాం.. కాని వాళ్లను తిట్టేస్తాం అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. తాజాగా చిరంజీవి చేసిన రెండు విభిన్న వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. అయినా చెట్టు గురించి చిరంజీవి ఏం తప్పుగా మాట్లాడారు..? ఆయన మాట్లాడిన దానిపై ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు అనుకుంటున్నారా..? ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి వ్యాఖ్యలతో సంబందం ఉంది.

చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులున్నారు. పొలిటికల్ గా ఆయనకు కాస్త మద్దతు లేకున్నా కానీ ఆయన చేసే ప్రతి వ్యాఖ్య జనాలకు బాగా రీచ్ అవుతుంది. మరి అలాంటి పొజిషన్ లో ఉన్న చిరంజీవి ఎలా మాట్లాడాలి. మాట్లాడిన ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన తెలంగాణ సర్కార్ చేస్తున్న హరితహారంపై ప్రశంసలు కురిపించారు.. ప్రభుత్వం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని తెగపొగిడేశారు. పొగిడితే తప్పేంది..? మంచి పని చేస్తే అలా అనడం మామూలే కదా అని అనుకుంటున్నారేమో.. అంతకు ముందు ఏపిలో ఆయన ఇలాంటి కార్యక్రమం మీద చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఓ నిర్ణయానికి రండి.

ముందు నుండి హరితాంధ్రప్రదేశ్ అనే విజన్ ఉన్న ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు నీరు – చెట్టు పేరుతో గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఎప్పుడో చేపట్టారు. ఆ కార్యక్రమం పేరుతో ఊరూరా తిరుగుతున్న చంద్రబాబుపై… కాంగ్రెస్‌ నేతలతో పాటు… మన చిరంజీవిగారు సైతం విమర్శలు వర్షం కురిపించారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఇలాంటి కార్యక్రమం మీద విమర్శలు కురిపించిన చిరంజీవి మరి తెలంగాణలో కేసీఆర్ చేస్తే మాత్రం ఎందుకు పొగుడుతున్నారు అనేది లాజిక్.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో కొన్ని లోటుపాట్లు ఉండటం సహజం.. అవి ప్రజలకు పూర్తి స్థాయిలో మంచి చెయ్యవచ్చు లేదా ఫెయిల్ కావచ్చు. కానీ ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల కోసమే. అలాంటిది మొక్కలు నాటడం అనే పని ఏపిలో చేసినా, తెలంగాణలో చేసినా, కేసీఆర్ చేసినా, చంద్రబాబు చేసినా ఒక్కటే. ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, వారికి ప్రోత్సాహానివ్వడం చాలా మంచిది. కానీ మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి వ్యాఖ్యను ప్రజలు గమనిస్తున్నారు అనే ధ్యాస ఉండాలి. చిరంజీవి ఇప్పటికైనా చేసే వ్యాఖ్యలను కాస్త జాగ్రత్తగా చేస్తే మంచిది. కానీ దీన్ని కొంత మంది మాత్రం వేరేలా ఒక్క మాటలో చెప్పేస్తున్నారు.. ఎంతైనా పక్కింటి కూర పుల్లన అని అంటున్నారు.

Related posts:
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
మూడింటికి తేడా ఏంటి..?
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
చెత్త టీంతో చంద్రబాబు
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments