అమావాస్య చంద్రుడు

Chiranjeevi sudden entry into Kapu protest

అమావాస్య నాడు చంద్రుడిని చూశాను అని ఎవరైనై అంటే మనలో ఎంత మంది నమ్ముతారు. ఎవరు నమ్మరు ఎందకంటే.. అమావాస్య నాడు చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు..? చీకటి మాత్రమే ఉంటుంది చంద్రుడు కనిపించడు. మరి అలాంటి చంద్రులు చాలా మంది రాజకీయాల్లో అమావాస్య నాడు కనిపిస్తుంటారు. అవును రాజకీయ చంద్రులు అమావాస్యనాడు కనిపించి అందరికి ఆశ్చర్యాన్ని ఆలోచనను కలిగిస్తుంటారు. తెలుగు నాట ఒకనాడు పున్నమి చంద్రుడిలా వెలిగిన చిరంజీవి తర్వాత చీకట్లో కూరుకుపోయారు. ఒకప్పుడు ప్రజారాజ్యంతో ఏలేద్దామనుకున్న రాజకీయరంగ ప్రవేశం చేసిన చిరు.. చివరకు తన పార్టీన కాంగ్రెస్ లో కలిపి.. చీకట్లోక జారుకున్నారు. చాలా కాలం తర్వాత చిరు వార్తల్లో నిలిచారు. ఆయన రాసిన ఓ లేఖ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఏపిలొ గత కొంత కాలంగా కాపులకు న్యాయం చెయ్యాలని కాపు సామాజినక వర్గానికి చెందిన నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టారు. గతంలో తునిలో జరిగిన ఘటనల నేపథ్యంలో ముద్రగడ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు బలవంతంగా సెలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తే ఆయన వాటిని ఎక్కించుకోలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద చిరంజీవి ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు. దానిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు.

ఎంతో కాలంగా కాపులకు చెందిన ముద్రగడ.. వారి అభివృద్ది కోసం అంటూ నినదిస్తూ.. పోరాడుతున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి మరి ఏనాడు కూడా ఆయనకు మద్దతుగా కానీ లేదంటే వ్యతిరేకిస్తూ కానీ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం మొదటిసారి ముద్రగడకు అనుకూలంగా అన్నట్లు లేఖ రాయడం మీద మంత్రులు కూడా మండిపడుతున్నారు. మంత్రి నారాయణ దీని మీద తీవ్రంగా స్పందించారు. చిరంజీవికి వారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కాపులు గుర్తుకురాలేదా..? అని ప్రశ్నించారు. అప్పుడు కనీసం నోరుమెదపని చిరంజీవి ఇప్పుడు మాత్రం ప్రభుత్వం కుట్ర చేస్తోంది అన్నట్లు ఎందుకు వేలెత్తిచూపిస్తున్నారు అని ప్రశ్నించారు.

నిజానికి చిరంజీవి దీని మీద గతంలో కూడా మాట్లాడి ఉంటే ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండేవాళ్లు కాదేమో.. కానీ ఇప్పుడే నాకు తెలిసింది.. గతంలో ఎన్నడూ జరగని అన్యాయం అంటూ విడ్డూరంగా రాసిన లేఖ అందరికి షాకిచ్చింది. నిజానికి చిరంజీవికి కాంగ్రెస్ లో మైలేజ్ లేదనిపిస్తోంది. అందుకే గతకొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అందుకే కనీసం కాపుల కార్డు పట్టుకొని రాజకీయ అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారి వాదనలో కూడా ఎలాంటి డౌట్ లేదు.

అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా.. అధికారంలో లేనప్పుడు మరోరకంగా మారడమే రాజకీయం అని అందరికి తెలుసు. కానీ చిరంజీవికి తెలిసింది.. రాజకీయమేనా అని కొంత మంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే అలాంటి రాజకీయ నీతి ఆయనకు తెలిసి ఉంటే ఈ పాటికి ఆ సామాజిక వర్గానికి ఓ పెద్ద దిక్కుగా నిలిచే వారు.. కనీసం ఆ వర్గానికి చేరువయ్యేవాడు అనే వాళ్లు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కూడా కాస్త గ్యాప్ తీసుకున్నా కానీ.. మరోసారి రాజకీయాల్లో ఈ కుల కార్డుతో ముందుకు రావడం నిజంగా చర్చనీయాంశమే. మరి చిరుకు చిత్తశుద్ది ఉంటే లేఖల దాకా చేస్తారా.. ? లేదంటే రంగంలోకి దిగి వాళ్ల మద్దతును మూటగట్టుకుంటారా..? అన్నది చూడాలి.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments