అప్పుడు చిరు బాధపడ్డాడట

Chiranjeevi's most painful situations

మెగాస్టార్ చిరంజీవి తన అనుభవాలను సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పంచుకున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత చేసిన ఖైదీ సినిమా ఇప్పటికే విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా ఫుల్ టైం పాలిటిక్స్ నుండి ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. తమిళనాడులో ఎంజీఆర్ ఏఐడిఎంకే పార్టీని ఎలా అయితే స్థాయించారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ ఎలా అయితే స్థాయించారో, చిరంజీవి కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చిరంజీవి తన పార్టీని బరిలోకి దించి 18 ఎమ్మెల్యే సీట్లను సాధించారు. కాగా తర్వాత కొన్ని పరిణామాలతో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీలో ఎంతో కీలకంగా ఉన్న ఓ ఎమ్మెల్యేకి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి, చిరంజీవికి రాజ్యసభ పదవి, కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. కాగా తాను నాడు రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉన్న టైంలో జరిగిన రెండు బాధాకర ఘటనలను చిరంజీవి రోజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఓ ప్రాంతీయ ఉద్యమం తీవ్రంగా ఉన్న టైంలో చిరంజీవి ఉమ్మడి రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నాలపై కొంత మందిపడ్డారు. చిరంజీవి మీద తమ వ్యతిరేకతను ప్రదర్శించడానికి కొంత మంది ఆయన ఇంటికి చీరలు, గాజులు పంపించారట. అది నిజంగా చిరంజీవిని చాలా బాధపెట్టిందట. అలాగే తన కటౌట్లను తగలబెట్టడం కూడా ఆయనను బాధకలిగించిందట. తాను తన శక్తివంచనకు తగ్గట్టుగా కృషి చేస్తున్నా కానీ ఇలా జరగడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని చిరంజీవి గతాన్ని గుర్తుచేసుకున్నారు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
అంత దైర్యం ఎక్కడిది..?
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
మంత్రుల ఫోన్లు బంద్
అమెరికా ఏమంటోంది?
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
అతి పెద్ద కుంభకోణం ఇదే
ఛాయ్‌వాలా@400కోట్లు
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?

Comments

comments