చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’

Cinema on AP CM Chandrababu Naidu

Cinema on AP CM Chandrababu Naidu. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

సినిమాలకు, రాజకీయాలకు చాలా దగ్గరి సంబందం ఉంటుంది. ఓ వ్యక్తికి విపరీతమైన పాపులారిటీ రావాలంటే ఐతే సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగా మారాలి లేదంటే రాజకీయ నాయకుడిగా మారాలి. అందుకే చాలా వరకు ఈ రెండు ఫీల్డ్ లక చెందిన వాళ్లకు చాలా ప్రయార్టీ ఉంటుంది. అందుకే తాజాగా ఏపి సిఎం కూడా దీన్ని గుర్తించినట్లున్నారు. ఏపి సిఎం చంద్రబాబు మీద సినిమా తీస్తున్నారు. సినిమాకి ‘చంద్రోదయం’ అనే టైటిల్‌ పెట్టారు. ఆగస్ట్‌ 4న ప్రారంభం కానున్న ఈ చిత్రానికి తెరవెనుక కర్త, కర్మ, క్రియ అంతా తెలుగుదేశం పార్టీ నాయకులే. విజయవాడకు చెందిన టిడిపి నాయకుడొకరు ఈ చిత్రానికి నిర్మాత. ఆయన పేరు మల్లికార్జున యాదవ్‌. ఒంగోలులో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారట. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాధించిన విజయాల్ని జనంలోకి తీసుకెళ్ళడానికే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం.

టివిలో విజువల్‌ యాడ్స్‌, పత్రికా ప్రకటనలతో పబ్లిసిటీ పరంగా అనుకున్న లక్ష్యాలని చేరుకోలేకపోతున్నామనే భావనతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు, ఈ చిత్ర నిర్మాణం కోసం నిర్ణయం తీసుకుని, పార్టీ నాయకుల ద్వారా ఆ పని కానిచ్చేస్తున్నారట. ఫండింగ్‌ అంతా తెలుగుదేశం పార్టీ నుంచే ఉండొచ్చు. అయితే తెలంగాణలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదు. పూర్తిగా ఇది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సినిమాగా ఉంటుంది. తెలుగు సినిమాల్లో హైదరాబాదీ సినిమాలు వేరన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌ సినిమాలు కూడా వేరని అనుకోవాలేమో. అయినా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నాయకులు జనాలకు ప్రభుత్వం సినిమా చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి టైంలో సినిమా తీసి మరీ చూపించాలా..? అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్

Comments

comments