కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం

Clash betweem karnataka and Tamilnadu for Kaveri Waters

Clash betweem karnataka and Tamilnadu for Kaveri Waters. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

కర్ణాటక రాష్ట్రం రగిలిపోతోంది. తమిళనాడు రాష్ట్రానికి కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే, ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమిళ తంబీలు, కన్నడిగులు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు దిగుతున్నారు. తమిళనాడులో కన్నడిగుల హోటల్ పై పెట్రోల్ బాంబు దాడి జరగగా.. కర్ణాటకలో తమిళనాడుకు చెందిన వాహనాలను తగులబెట్టారు. తమిళనాడుకు 12వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మళ్లీ ఆదేశించిన నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు పట్టణాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో.. బెంగళూరులో నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించ వద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఏం జరిగింది:
నిజానికి నాలుగు జిల్లాల సాగుతో పాటు బెంగళూరు నగరానికి తాగునీటికి కావేరి నదే ప్రధాన నీటివనరు. ఈ ఏడాది తగినంత వర్షాలు లేక కేఆర్‌ఎస్‌ ప్రాజెక్టు నిండలేదు. దీంతో తమిళనాడుకు నీళ్లిచ్చేందుకు కర్ణాటక అభ్యంతరం తెలిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు నీటి విడుదలను సాధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడుకు కావేరీ నీటిని మళ్లిస్తున్నారు. దీంతో కర్ణాటకలో ఆయకట్టుకు విడుదల చేయకుండా తమిళనాడుకు మళ్లించడాన్ని నిరసిస్తూ కర్ణాటకలో అగ్గిరగిలింది.

సుప్రీంకోర్టులో కర్ణాటక
కావేరీ జలాల విడుదల అంశంలో కర్ణాటక ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించింది. కావేరీ జలాల విడుదలపై ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తమిళనాడు రాష్ట్రానికి 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని గత నెల 5న ఇచ్చిన తీర్పు నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం కోర్టును కోరింది. తమిళనాడుకు 15వేల క్యూసెక్కులు కాకుండా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా తీర్పును సవరించాలని విజ్ఞప్తి చేసింది.

కర్ణాటక తాజా అప్పీల్ పై సుప్రీం.. ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా పునఃసమీక్షించాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఈ సోమవారం (12.09.2016 ) నుండి సెప్టెంబర్‌ 20 తమిళనాడుకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది. కోర్టు తీర్పును నిరసిస్తూ కర్ణాటక ప్రజలు చేసిన ఆందోళనలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దేశ ప్రజలందరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కర్ణాటక, తమిళనాడు ప్రజలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించాలని.. అధికారులు శాంతిభద్రతల కాపాడే విధంగా పనిచేయాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు తీర్పుపై మళ్లీ కన్నడిగులు భగ్గుమన్నారు. రోడ్లపైకి చేరి ఆస్థుల విధ్వంసానికి దిగారు. బెంగళూరులో తమిళనాడు నెంబరు ప్లేట్‌ ఉన్న వాహనాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. కేపీఎస్‌ బస్టాండులో ఉన్న తమిళనాడుకు చెందిన 40 ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ ఘటనలో కేటీఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన 38 బస్సులు, ఎస్‌ఆర్‌ఎస్‌కు చెందిన మరో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. అలాగే తమిళనాడు వాహనాలను కర్ణాటకలో ప్రవేశించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యగా కర్ణాటక నుండి తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిపివేశారు. హింసాత్మక ఘటనలు పెరగడంతో.. బెంగళూరులో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా ఆపేశారు.కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ వద్ద 500 మందితో పహరా కాస్తున్నారు.

కర్ణాటక నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిపేశారు. తమిళనాడు వాహనాలను కర్ణాటకలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. బెంగళూరులో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు. తమిళులు నివసించే ప్రాంతాల్లో పోలీసు రక్షణ కల్పించారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూసివేశారు. మైసూర్‌ నగరంలో కూడా ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడుకు నీటి విడుదలపై అసంతృప్తితో మైసూర్‌లో కూడా రెండు వాహనాలపై దాడి చేశారు. మరోవైపు తమిళనాడులోనూ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన ఐదు టూరిస్ట్‌ వాహనాలను ధ్వంసం చేశారు.

తమిళనాడులో కన్నడ హోటల్‌పై పెట్రోల్‌ బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు.ఇరు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఇలాంటి హింసాత్మక ఘటనలు మళ్లీ జరగకూడదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలను కోరారు. బెంగళూరులో పరిస్థితి చేయిదాటడంతో ఐటీ సంస్థలన్నీ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. ఐటీ సంస్థలే కాదు ఇతర సంస్థలు కూడా ఉద్యోగులను ఆఫీసులకు రావొద్దని చెప్పాయి.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
జీఎస్టీ బిల్ కథ..
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
సింధూరంలో రాజకీయం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
బాబు Khan
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
వెనకడుగు
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ప్రత్యేక హోదా లాభాలు
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments