యుపిలో అఖిలేష్, ములాయంల వార్

Clash between Mulayam and Akhilesh in Samajwadi party

ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్, యుపి సిఎం అఖిలేష్ ల మధ్య సాగుతున్న వార్ అనేక మలుపులు తిరుగుతోంది. ములాయం సింగ్ ఫ్యామిలో మళ్లీ సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అఖిలేష్ తండ్రికి చెక్ పెట్టేశారు. సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ నియామకం జరిగిపోయింది. లక్నోలో జరిగిన జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశంలో తండ్రిని పదవి నుంచి తప్పించి సలహాదారుగానే నియమించారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ను తొలగించారు. ఆయనస్థానంలో రాంగోపాల్ యాదవ్ ను నియమించారు.అమర్ సింగ్ ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు.

సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వేడి పుట్టిస్తోంది. తండ్రీకొడుకుల సవాల్ గా యుపిలో వాతావరణం వేడెక్కింది. కాగా బాబాయి శివపాల్ యాదవ్ పై అఖిలేష్ మండిపడ్డారు. అఖిలేష్ సమావేశానికి 200 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. దాదాపు ఐదు వేలమంది కార్యకర్తలు హాజరైన ఈ సమావేశంలో రాంగోపాల్ యాదవ్, శివపాల్ పై మండిపడ్డారు. పార్టీని శివపాల్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. అఖిలేష్ మాత్రం తండ్రికి తాను ఎప్పటికీ విధేయుడనేనని ప్రకటించుకున్నారు.

అఖిలేష్ సమావేశంలో నిర్ణయాలు వెలువడిన వెంటనే పెద్దాయనకు కోపం కట్టలు తెంచుకుంది. వారెవరు నన్ను పదవి నుంచి తప్పించడానికని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంగోపాల్ యాదవ్ ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. నిన్న టీకప్పులో తుఫాను లా చల్లారని కుటుంబ కలహాలు తెల్లారేసరికి మళ్లీ మొదటికొచ్చాయి. లాలూ నెరిపిన దౌత్యం కూడా ఫలించలేదు. అఖిలేష్ ప్రభుత్వంలోనే కాకుండా పార్టీపైన పట్టునింపుకోవడానికే ఈ ప్రయత్నం చేశాడంటున్నారు. మొత్తం మీద ములాయం ఫ్యామిలీ డ్రామా యూపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతోందో వేచిచూడాలి.

Related posts:
అమావాస్య చంద్రుడు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments