టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే

clashes in TRS party

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుంది అని సామెత ఉంది. ఇదే సామెత ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కూడా వర్తిస్తుంది. తెలంగాణ ఉద్యమంతో ముందుకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రతిపక్షాలకు చెమటలు పట్టించారు. ఉద్యమ నేపథ్యంలో భారీగా చేరికలకు తెర తీసిన టిఆర్ఎస్ కారులో జనాలు ఎక్కువైపోయారు. ఇప్పటికే అర్హతకు మించిన భారానికి మోస్తున్న టిఆర్ఎస్ ఇప్పుడు చీలకల దిశగా అడుగులు వేస్తోందా..? అని అనుమానాలు కలుగుతున్నాయి. కానీ కొన్ని జిల్లాల పరిస్థితిని గమనిస్తే మాత్రం ఆ అనుమానాలు ఖచ్చితంగా వాస్తవాలే అని తెలుస్తోంది.

తెలంగాణలో మొదటి సర్కార్ ను ఏర్పాటు చేసిన తర్వాత నుండి కేసీఆర్ ప్రతిపక్షాలను టార్గెట్ గా చేశారు. ఏ ప్రతిపక్షానికి బలం లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఆ మేరకు భారీగా తమ పార్టీలోకి చేరికలతో నాయకులకు వలస వచ్చే అవకాశాన్ని కల్పించారు. అయితే ఇప్పుడు పార్టీలో అసంతృప్తి వర్గాలు ఎక్కువయ్యాయి. పార్టీలో ఎంతో కాలంగా ఉన్నా పదవులు దక్కలేదని కొందరు, పార్టీ మారినా కూడా పదవి మాత్రం దక్కలేదని మరికొందరు ఇలా ఎవరికి వారు రాగాలు తీస్తున్నారు.

ఇలా కూనీ రాగాలు తీస్తున్న అసంతృప్తి వర్గానికి వరాల పదవులు కట్టబెట్టేందుకు కేసీఆర్ ఎంతో నేర్పుగా కొత్త జిల్లాల ప్రకటన చేశారు. అట్టహాసంగా 31 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. కానీ గతంలో చేరికల టైంలో చేరిన వారు ఇప్పుడు వర్గపోరుకు దిగుతున్నారు. వర్గపోరుకు ఇప్పుడిప్పుడే వరంగల్ వేదికగా మారింది. పార్టీలో బలంగా ఉన్న కొండా మురళి, వరంగల్ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌ ల మధ్య జిల్లాలో పోరు తీవ్రతరమైంది. ఎంతలా అంటే కొండా మురళికి చెందిన ఎవరు అధికారికంగా మేయర్ కార్యక్రమాలకు వెళ్లినా వెంటనే ఫోన్లు చేసి మరీ మురళి దూషిస్తున్నాడట.

అయితే ఇప్పుడు వరంగల్ లో ఏర్పడిన పరిస్థితి ఎంతో కాలం క్రితం తెలంగాణ అంతటా ఏర్పడాల్సింది. ఎందుకంటే కెపాసిటీకి మించిన లోడ్ తో వెళుతున్న కారుకు ఖచ్చితంగా భారం ఎక్కువవుతోంది. మరి దాంతో మామూలుగానే పార్టీలో వర్గపోరు, ఆధిపత్య పోరు తప్పదు. రెండున్నరేళ్ల తర్వాత కానీ టిఆర్ఎస్ లో వర్గపోరు వ్యవహారం బయటకు రాలేదు. మొత్తంగా చూస్తే మాత్రం టిఆర్ ఎస్ అధినేత నాడు ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన పార్టీ నాయకుల చేరికుల ఇప్పుడు లేని ముసలాన్ని పార్టీలో రాజేసింది. మరి చూడాలి పరిస్థితి ఎలా ఉంటుందో సమీప భవిష్యత్తులో తేలిపోతుంది.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
ఆ అద్భుతానికి పాతికేళ్లు
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
చంద్రుడి మాయ Diversion Master
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
అన్నదమ్ముల సవాల్
పట్టిసీమ వరమా..? వృధానా..?
మూడింటికి తేడా ఏంటి..?
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా లాభాలు
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
పైసలు వసూల్ కాలేదుగా..
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments