కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?

CM KCR plans Big for Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్లాన్ చేస్తారు. తాను ఏ పని చెయ్యాలనుకున్నా దాన్ని ఓ పద్దతి ప్రకారం చేస్తుంటారు. అలాంటి కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొన్ని చోట్ల హర్షాతిరేకాలు, మరికొన్ని చోట్ల మాత్రం వ్యతిరేకతలు వస్తున్నాయి. అయినా కేసీఆర్ అలాంటి నిర్ణయం ఏం తీసుకున్నారు అని అనుకుంటున్నారా..? కొత్త జిల్లాల ఏర్పాటు. గతంలో కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించే టైంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ముందు చూపుతో మాట్లాడారు. తెలంగాణ జిల్లాలను విభజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన అప్పుడే ఆలోచించారు.

పరిపాలన సౌలభ్యం కోసం అనే క్యాప్షన్ తో మొదలైన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొత్త మలుపులు తిరుగుతోంది. చాలా జిల్లాల్లో మా ప్రాంతాన్ని జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక జిల్లాను రెండు లేదా అంతకు మించిన జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు కదులుతోంది. కాగా దీనిపై ప్రభుత్వం స్పీడ్ చూసి అందరూ షాకవుతున్నారు. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. కాగా గతంలో కేసీఆర్ కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో మాత్రమే పలానా ప్రాంతాన్ని మేం జిల్లాగా మారుస్తాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో జిల్లాను రెండు మూడు, నాలుగు జిల్లాలుగా కూడా చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం అనుకున్నదే ఆలస్యంగా చకచకా దీనిపై కార్యశూరతను ప్రదర్శిస్తోంది. అందుకుగాను ఇప్పటికే కేంద్రానికి సిఫారసులు కూడా పంపించింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలన సాగించడానికి సివిల్ సర్వెంట్లను కేటాయించాలని కోరింది. ఇక కొత్త జిల్లాల కేంద్రాల నుండి పరిపాలన కొనసాగించడానికి భవనాల వేట మొదలైంది. అయినా కేసీఆర్ ఇంత హడావిడిగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎందుకు సిద్దపడుతున్నాడు.? దానికి ఒక్కటే సమాధానం. పరిపాలన సౌలభ్యం కోసం. ఒక్కో జిల్లా విస్తీర్ణపరంగా పెద్దగా ఉండటం.. కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి 200 నుండి 400 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. దాంతో పరిపాలన సౌలభ్యంలేదు. దాంతో ఇప్పుడు కేవలం 60 కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా కేంద్రం వచ్చేటట్లు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాగి ఉన్న మర్మం పార్టీ పరంగా ఏంటంటే.. పార్టీ శ్రేణులను కూడా ప్రతి గ్రామంలో బలపరిచేలా చెయ్యడం. పైగా రాజకీయంగా నిరుద్యోగతను కూడా తగ్గించవచ్చు.

ఇక ముందు నుండి కూడా కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో సహాయాన్ని పొందలేకపోతున్న తెలంగాణ రాష్ట్ర ఈ కొత్త జిల్లా ద్వారా కూడా లాభం పొందాలని అనుకుంటోంది. అదేంటి కొత్త జిల్లాల వల్ల కేంద్రం నుండి ఎలా లాభం కలుగుతుంది అనుకుంటున్నారా..? కేంద్రం నుండి విడుదలయ్యే కొన్ని నిధులు రాష్ట్రంలో ఉండే జిల్లాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ జిల్లాలు ఉండటం వల్ల కేంద్రం ఎక్కువ నిధులను కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వెనుకబడిన జిల్లాల కింద కూడా కేంద్రం నుండి నిధులను పొందే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ ఈ కోణంలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్దపడుతున్నట్లు సమాచారం.

ఇక మరోపక్కన తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబందించిన కొన్ని వాస్తు, సంఖ్యాశాస్త్రాలను కూడా కేసీఆర్ నమ్ముతున్నారని తెలిసింది. అతపెద్ద జిల్లాగా ఆదిలాబాద్ ఉండటం ఓ రకంగా కలిసిరాదు అని అందుకే దాన్ని నాలుగు జిల్లాలుగా చెయ్యాలని ఎవరో సూచించారట. అలాగే జిల్లాల సంఖ్య 23 నుండి 25 వరకు ఉండే అవకాశాలున్నాయని ముందు నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పాటుకు కేసీఆర్ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఎందుకు అలా అంటే.. కేసీఆర్ లక్కీ నెంబర్ 6. 24 సంఖ్యలోని అంకెలను కూడితే 6 వస్తుంది. ఇలా వాస్తు, సంఖ్యాశాస్త్రం పరంగా ఇటు తెలంగాణకు, కేసీఆర్ కు బాగా కలిసి వస్తుంది అని బాగా నమ్ముతున్నట్లు ఓ వార్త.

  -Abhinavachary

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
సింధూరంలో రాజకీయం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ఎవరు చాణిక్యులు..?
మద్యల నీ గోలేంది..?
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
ఇక యుద్ధమే కానీ..
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments