ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే

Comminication Gap

Comminication Gap. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవ సభలో మాట్లాడిన తీరు తెలుగు తమ్ముళ్లకు మింగుడుపడటంలేదు. పవన్ కళ్యాణ్ టిడిపికి, బిజెపికి మద్దతుగా మాట్లాడకపోగా లెఫ్ట్ టర్న్(వామపక్షాల వైపు) తీసుకోవడం ఏంటని అనుకుంటున్నారు. మూలిగే నక్క పై తాటికాయపడ్డట్లు పవన్ టిడిపి, బిజెపిలకు వ్యతిరేకంగా ప్రత్యేక హోదాపై డిమాండ్ చేస్తూ మాట్లాడటం టిడిపి వర్గానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయాన్ని పూర్తిగా చదివి, అర్థం చేసుకొని తమ వత్తిడి వల్లే కేంద్రం దిగి వచ్చిందని,  ఇది దాని ప్రతిఫలమే అని అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడాలని బహిరంగ సభలో పిలుపునిస్తే బాగుండేదని తెలుగుదేశం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది ఖచ్చితంగా కమ్యూనికేషన్ గ్యాపే అని లేదంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని అనుకుంటున్నారు. వద్దు మొర్రో అన్న అర్థరాత్రి (07.09.2016)ఏడు పేజీల డాక్యుమెంట్ ను ఈ-మెయిల్ ద్వారా ఆగమేఘాలపై పంపించి చదువుతావా.. చస్తావా అన్నట్లు కేంద్రం వ్యవహరించిందని.. దాని తర్వాత రోజే(08.09.2016) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమని, ఆ తర్వాత రోజే(09.09.2016) పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కాకినాడలో ఉండటం వలన ఒకరి మధ్య ఒకరికి కమ్యూనికేషన్ సరిగా జరగలేదని, దాని కారణంగా మొత్తం రాజకీయాన్ని చేతులారా చెడగొట్టుకున్నారని వాపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ కమ్యూనికేషన్ గ్యాపే కొంపముంచిందని అనుకుంటున్నారు.

ఇది ఇలా జరిగి జరగవలసింది కాదు అని చేతులారా చెడగొట్టుకున్నారని బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కారణంగా జరగవల్సిన డ్యామేజ్ జరిగిందని మాట్లాడుకుంటున్నారు. 10వ తేది నాడు జరిగిన రాష్ట్ర బంద్ కారణంగా ప్రజల్లో ప్రత్యేక హోదాపై కసి పెరిగిందని, ఇటువంటి సమయంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక సహాయం గురించి ఎంత చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలేదని, ఇది చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకోవడంలాంటిదేనని అభిప్రాయపడుతున్నారు.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
ఉక్కిరిబిక్కిరి
మూడింటికి తేడా ఏంటి..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఇక యుద్ధమే కానీ..
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
పవన్ క్షమాపణలు చెప్పాలి
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments