నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట

Jobs-or-five-lakh

నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఆసరాగా తెలంగాణ సర్కార్ తాజాగా జీవో పాస్ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించడంతో.. జీవో 214 స్థానంలో తెచ్చిన కొత్త జీవోలో ప్రభావిత కుటుంబాలకు ఉద్యోగం లేదా ఐదు లక్షల రూపాయల పరిహారం లేదా ఇరవై ఏళ్ల పాటు ప్రత్యేక సహాయం చేసేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు వచ్చింది. నిర్వాసితులకు తెలంగాణ సర్కార్ చేస్తామన్న సహాయాన్ని జీవో ద్వారా చట్టం చెయ్యాలని, భూసేకరణ చట్టం2వ షెడ్యూల్ లో సూచించిన విధంగా సహాయం, పునరావాసం కల్పించాలని హైకోర్టు  ఆదేశించింది.

కొత్త జీవోలోని అంశాలు…     

  • నిర్వాసితులకు రూ.5.04 లక్షలతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు. ఒంటరిగా నివాసం ఉండే వారికి ఇంటి కోసం రూ.1.25 లక్షలు.
  • ప్రతి కుటుంబం రీసెటిల్మెంట్‌ కోసం పరిహారం. నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ప్రాజెక్టు ద్వారా ఉద్యోగ కల్పన లేదా నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పిస్తారు. లేనిపక్షంలో ఏకమొత్తంగా రూ.5 లక్షలను పరిహారంగా చెల్లిస్తారు.
  • ఈ రెండింటికీ అంగీకరించకపోతే, ప్రభావిత కుటుంబాల్లో ఎస్సీ, ఎస్టీలకు 20 ఏళ్లపాటు నెలకు రూ.3 వేల చొప్పున; ఇతరులకు నెలకు 2500 చొప్పున 20 ఏళ్లపాటు పరిహారం ఇస్తారు.
  • రూ.40 వేలు జీవనోపాధి భృతిగా ఇస్తారు.
  • షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఏకమొత్తంగా రూ.60 వేలు పరిహారంగా ఇస్తారు.
  • నిర్వాసిత కుటుంబాలకు తరలింపు నిమిత్తం రూ.60 వేలను రవాణా గ్రాంటుగా అందిస్తారు.
  • చేతివృత్తిదారులు/ స్వయం ఉపాధితో జీవిస్తున్న వారికి వనటైమ్‌ గ్రాంటుగా రూ.30 వేల సహాయం.
  • రూ.60 వేలను పునర్‌నిర్మాణ సహాయం కింది ఒకేసారి చెల్లిస్తారు.
  • ఉద్యోగం, ఉపాధి కల్పన, వనటైమ్‌ సెటిల్మెంట్‌ ఇతరత్రా పరిహారాలు వద్దనుకుంటే ఏకమొత్తంగా రూ.7.5 లక్షలను గంపగుత్తగా ఇస్తారు.
  • ప్రాజెక్టుల్లో చేపల పెంపకం, పట్టుకోవడంపై పూర్తి హక్కులు కల్పిస్తారు.

(Inputs: Andhrajyothy)

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
సదావర్తి సత్రం షాకిచ్చింది
2018లో తెలుగుదేశం ఖాళీ!
బతుకు బస్టాండ్ అంటే ఇదే
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తిరిగిరాని లోకాలకు జయ
శోభన్ బాబుతో జయ ఇలా..
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
బాబుకు గడ్డి పెడదాం
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
యాహూ... మీ ఇంటికే డబ్బులు
పాపం.. బాబుగారు వినడంలేదా?
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments