ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై….!

congress-hoda

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం అయిపోయింది. ప్యాకేజీతో స‌రిపెట్టేసింది కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు. ప్ర‌త్యేక హోదాకు మించిన ప్ర‌యోజ‌నాల‌ను ఆంధ్రాకు ప్యాకేజీలో రూపంలో ఇస్తున్నామ‌ని కేంద్రం డబ్బా కొడుతోంది. కేంద్రం గానా బజానాకు ఏపిలోని అధికార తెలుగుదేశం నేత‌లు కూడా తాళం వేస్తున్నారు.  నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాజీలేని పోరాటం చేస్తామ‌నీ, హోదా వ‌చ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామ‌ని చెప్పిన నేత‌లు ఇప్పుడు మాట మార్చేశారు. హోదా కంటే ప్యాకేజీయే గొప్ప అంటున్నారు. కేంద్రం హోదా ప్ర‌క‌టించిన త‌రువాత ఆంధ్రా ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌, రాజ‌కీయ పార్టీల విష‌యానికొస్తే విప‌క్ష వైకాపా కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా బంద్ నిర్వ‌హించింది. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా భాజ‌పా తీరుపై కాకినాడ స‌భ‌లో దుయ్య‌బ‌ట్టారు.

ఇక‌, అధికార తెలుగుదేశం సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్యాకేజీ వివ‌రాల‌ను ఇలా మీడియాకి వివ‌రించారో లేదో.. వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించేసి ప్యాకేజీని స్వాగ‌తిస్తున్నాం అని చెప్పారు. మిగిలింది కాంగ్రెస్ పార్టీ! రాష్ట్ర విభ‌జ‌న పాపాన్ని టోకున మోస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ మ‌ధ్య ప్ర‌త్యేక హోదా విష‌య‌మై కాస్త మార్కులు కొట్టేసింద‌నే చెప్పాలి.  కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదాపై ప్రైవేటు బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డంతో మ‌రోసారి హోదా విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది. బిల్లుకు మ‌ద్ద‌తుగా ప‌లు పార్టీలు కూడా సిద్ధ‌ప‌డ్డాయి. అయితే, ఈ ప్రైవేటు బిల్లుపై చ‌ర్చించేందుకు స‌భ నిరాక‌రించ‌డం తీవ్ర దుమారాన్ని రేపింది.

ఇప్ప‌డు హోదా లేదు,  కేవ‌లం ప్యాకేజీ మాత్ర‌మే ఇవ్వ‌గ‌లం అని భాజ‌పా చేతులు దులిపేసుకుంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి పోరాటానికి సిద్ధం అవుతోంది. ప్ర‌త్యేక‌హోదాపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు ఏపీపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి. ఆంధ్రాకు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్రంలోని భాజ‌పా, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలు అడ్డుప‌డ్డాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ తిరుప‌తి నుంచి ప్రారంభం అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌త్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వొద్ద‌ని 14వ ఆర్థిక సంఘంలో ఎక్క‌డా చెప్ప‌లేద‌ని ర‌ఘువీరా రెడ్డి అన్నారు. క‌మిష‌న్ స‌భ్యులే ఈ మాట చెబుతున్నార‌ని ర‌ఘువీరా చెప్పారు. ఇంత‌కీ… ప్రజాభిప్రాయ సేక‌ర‌ణ చేసిన త‌రువాత ఎలా ఉద్య‌మించాల‌ని కాంగ్రెస్ వ్యూహ ర‌చ‌న చేసుకుందో వేచి చూడాలి.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
అడకత్తెరలో కేసీఆర్
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
అన్నదమ్ముల సవాల్
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
వెనకడుగు
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
మద్యల నీ గోలేంది..?
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments