దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష

Court sentenced Dilsukhnagar bomb blast convicts

దిల్‌సుఖ్‌‌నగర్ జంట పేలుళ్ల దోషులకు ఎన్ఐఎ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లోని ఎ1 మిర్చి సెంటర్, వెంకటాద్రి ధియేటర్ ఎదురు బస్టాప్ లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా, 138 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ కు చెందిన రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్, రియాజ్ భత్కల్ పాల్పడ్డారని ఎన్ ఐ ఎ తేల్చింది. కాగా అందులో రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా, రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్ లకు ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

నిజానికి ఈ కేసు నాంపల్లి  క్రిమినల్ కోర్టులో ఉన్నా NIA ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. ఆ తర్వాత రంగారెడ్డి కోర్టుకు మార్చినా.. ఇబ్బందులు రావడంతో చర్లపల్లి జైలులోనే ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేశారు.  ఏడాది కాలంగా అక్కడే కేసు విచారణ కొనసాగించారు. చివరికి ఐదుగురిని దోషులుగా తేల్చింది కోర్టు.  ఈ కేసులో 157 మంది సాక్ష్యుల స్టేట్ మెంట్ నమోదు చేసింది NIA కోర్టు. కీలకమైన 502 డాక్యుమెంట్లను సేకరించిన NIA అధికారులు.. ఘటనా స్థలంలో 201 మెటీరియల్స్ సీజ్ చేశారు. వీటన్నింటిపై NIA తరపున బలమైన వాదనలు వినిపించారు. మూడు చార్జీషీట్లు దాఖలు చేశారు. దిల్‌సుఖ్‌‌నగర్ పేలుళ్లకు పాల్పడిన వారికి కోర్టు ఉరి శిక్ష విధించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
సల్మాన్ ఖాన్ నిర్దోషి
వీళ్లకు ఏమైంది..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
సల్మాన్ ను వదలని కేసులు
అడవిలో కలకలం
మావో నాయకుడు ఆర్కే క్షేమం
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

Comments

comments