గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ

Currency in air with Modi effect

లక్ష్మీదేవి గాల్లోలేవడం అంటే ఎప్పుడైనా విన్నారా? కానీ మోదీ పుణ్యమా అని అది జరుగుతోంది. మనల్ని కరుణించడానికి లక్ష్మీదేవి గాల్లోతేలుతోంది. రోజురోజుకు తీవ్రం అవుతున్న నోట్ల మార్పిడి.. బ్యాంకులు, ATM దగ్గర క్యూలను తగ్గించేందుకు ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది కేంద్రం. కొత్త నోట్లను దేశంలోని వివిధ బ్యాంకులకు చేరవేత ఇబ్బందిగా మారింది. ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆయా బ్యాంకులకు చేరాలంటే రెండు, మూడు రోజులు పడుతుంది. ఈ కారణంగా కొత్త నోట్లు ఉన్నా.. సరైన సమయంలో జనానికి చేరటం లేదు. ఈ జాప్యాన్ని తగ్గించేందకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దిగింది.

కొత్త నోట్లు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ కు చేరవేస్తారు. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు తరలించనున్నారు. అదే విధంగా రాష్ట్ర రాజధానుల నుంచి కూడా ముఖ్యమైన సెంటర్లకు హెలికాఫ్టర్ల ద్వారా కొత్త నోట్లను తరలించటానికి ప్రణాళిక రూపొందించారు. ఈవారం అంతా ఈ విధంగానే నోట్ల చేరవేత ఉంటుంది ఆర్థిక శాఖలోని ముఖ్య ఉన్నతాధికారులు చెప్పినట్లు జాతీయ పత్రికలు వెల్లడించాయి. కొత్త నోట్లను బ్యాంకులకు తరలించే ప్రక్రియ 21 రోజుల్లో పూర్తి చేయాలని మొదట నిర్ణయించారు. జనం ఇబ్బందుల క్రమంలో.. రాబోయే ఆరు రోజుల్లోనే మొత్తం వ్యవహారాలను చక్కబెట్టాలనే నిర్ణయానికి వచ్చింది కేంద్రం. ప్రస్తుతం నగరాల్లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినా.. గ్రామీణ ప్రాంతాల్లో నోట్ల కొరత తీవ్రంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు హెలికాఫ్టర్లు, ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా ఆయా బ్యాంకులకు నోట్ల తరలింపు జరుగుతుంది.

Related posts:
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
ఆరిపోయే దీపంలా టిడిపి?
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
సల్మాన్ ఖాన్ నిర్దోషి
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
ఓడినా విజేతనే.. భారత సింధూరం
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
వాళ్లను వదిలేదిలేదు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
వంద, యాభై నోట్లు ఉంటాయా?
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments