సైరస్ మిస్ట్రీ ‘టాటా’…. కార్పోరేట్ లో ఓ మిస్టరీ

Cyrus Mistry Terminated from TATA

భారతదేశ మార్కెట్ దిగ్గజ కంపెనీల్లో పేరెన్నికగన్న కంపెనీ టాటా గ్రూప్. భారతదేశంలో స్వతంత్రానికి ముందు నుండి ఉన్న టాటా గ్రూప్ ఇప్పుడు డైలమాలో పడింది. టాటా గ్రూప్ కంపెనీ బోర్డ్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘టాటా సన్స్’ చైర్మన్ గా ఉన్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికారు. కొత్త చైర్మన్ ను ఎంపిక చేసేందుకు ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ లో రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోన్ సేన్, కుమార్ భట్టాచార్య ఉన్నారు. అయితే, నాలుగు నెలల పాటు తాత్కాలిక చైర్మన్ గా రతన్ టాటా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, 2012లో టాటా సన్స్ సంస్థ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ బాధ్యతలు స్వీకరించారు. ఏరికోరి తెచ్చిన మిస్త్రీని తీసివేయడం వెనుక కారణాలు పెద్దపెద్ద వ్యాపారవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కానీ టాటాలంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, ఈ నిర్ణయం తెలియజేస్తోంది. టాటాలు భారతీయ ఆస్తిగా తమ సంస్థలను భావిస్తారు. దీంతో వ్యాపారంలో లాభాల కంటే విలువలు ముఖ్యమని భావిస్తారు. దీంతో టాటా సంస్థల నుంచి నాణ్యమైన సేవలు మాత్రమే లభ్యమవుతుంటాయి. వ్యాపారం చేసి ఆస్తులు సంపాదించుకునే కంటే…మానవత్వమున్న వ్యక్తిగా ఉన్నత స్థానానికి చేరడం ముఖ్యం అని భావిస్తారు. దీంతో మిస్త్రీ టాటా పగ్గాలు చేపట్టిన అనంతరం లాభాలు తెచ్చే వ్యాపార లావాదేవీలపై మాత్రమే లావాదేవీలు నిర్వహించడం గమనించారు. ప్రధానంగా ఎంతో మందికి అన్నం పెడుతున్న యూరోప్ లోని స్టీల్ ఇండస్ట్రీ భారంగా మారిందని దానిని అమ్మేయడం టాటా బోర్డు నిబంధనలకు విరుద్ధం.

సంస్థను మూసేయడం ద్వారా ఎంతో మంది కార్మికులు రోడ్డున పడడం టాటా సంస్థను నడిపై బోర్డు డైరెక్టర్లకు నచ్చలేదు. దీనితోపాటు సంస్థ లాభాల బాటపట్టడమే లక్ష్యం కదులుతున్న పావులు చూసిన డైరెక్టర్లు….ఇది టాటా సంస్థలా ఉండడం లేదని, ఫక్తు లాభార్జన చేసే సంస్థలా మారిందని టాటాకు ఉప్పందించారు. దీంతో వెంటనే సైరస్ మిస్త్రీ నిర్ణయాలను సమీక్షించిన రతన్ టాటా…ఆయన ఆలోచనలు మారాయని గుర్తించి, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించి, వదిలేసిన స్థానాన్ని మళ్లీ అధిష్ఠించారు. కొత్త వారసుడిని నాలుగు నెలల్లో తెరముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో టాటానా మజాకా అని భారతీయులు పేర్కొంటున్నారు. మొత్తానికి టాటా గ్రూప్ నిర్ణయం వల్ల భారత స్టాక్ మార్కెట్లు మాత్రం కుదేలయ్యాయి.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
సింగ్ ఈజ్ కింగ్
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ఈ SAM ఏంటి గురూ..?
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
బాబు బండారం బయటపడింది
మంత్రుల ఫోన్లు బంద్
బతుకు బస్టాండ్ అంటే ఇదే
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీ చేసిందంతా తూచ్..
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
అమ్మను పంపించేశారా?
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు

Comments

comments