30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు

Daughters met their Mother after thirty years

Daughters met their Mother after thirty years.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

30 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లీ కూతుళ్లు హైదరాబాద్ లో కలుసుకున్నారు. అవును.. 30 ఏళ్ల క్రితం విడిపోయిన తల్లీకూతుళ్లు చాలా గ్యాప్ తర్వాత చివరకు హైదరాబాద్ పోలీసుల సహాయంతో కలుసుకున్నారు. 30 ఏళ్ల క్రితం.. హైదరాబాద్‌కు చెందిన నజియాను దుబాయ్‌కు చెందిన షేక్‌ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నజియాను తీసుకుని దుబాయ్‌ వెళ్లిపోయాడు. వారికి అక్కడ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అమ్మాయిలు పుట్టిన తర్వాత షేక్‌.. నజియాను బలవంతంగా హైదరాబాద్‌కు పంపించేశాడు. పిల్లలను మాత్రం తనవద్దే ఉంచేసుకున్నాడు. ఒంటరిగా హైదరాబాద్‌కు వచ్చిన నజియా కు తన బతుకేంటో అర్థంకాని పరిస్థితి. కుటుంబ సభ్యుల ఒత్తిడితో రెండో పెళ్లి చేసుకుంది.

అటు.. దుబాయ్‌లో పెరిగి పెద్దయిన నజియా ఇద్దరు పిల్లలు ఫాతిమా, ఆయేషా.. తమ తల్లి ఎక్కడుంతో తెలుసుకోవాలనుకున్నారు. అమ్మను ఒక్కసారైనా కలుసుకోవాలని ఆరాటపడ్డారు. జనవరిలో హైదరాబాద్‌ కు వచ్చారు. కానీ.. తల్లి వివరాలు తెలియరాలేదు. అసలు వాళ్ల దగ్గరే వివరాలు లేవు. దీంతో.. తల్లి నజియాను కనుక్కోలేక మనోవ్యధకు గురయ్యారు. హైదరాబాద్ పోలీసులను సంప్రదించారు. నజియాకు సంబంధించిన ఫాతిమా, ఆయేషా వద్ద ఉన్నది కేవలం ఓ చిన్న ఫొటో మాత్రమే. దీంతో.. పోలీసులకు దర్యాప్తు కష్టంగా మారింది. ఐతే.. 30 ఏళ్లక్రితం తమనుంచి దూరమై తల్లి కోసం.. ఆయేషా, ఫాతిమా ఆవేదనకు చలించిన పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఎట్టకేలకు ఆరునెలల తర్వాత నజియా ఆచూకీ తెలుసుకోగలిగారు.అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఫాతిమా, ఆయేషాలకు విషయం తెలిపారు.

30ఏళ్ల తర్వాత తన బిడ్డలను కలుసుకున్న నాజియా ఆనందంతో కన్నీటిపర్యంతమైంది. అటు.. ఎప్పుడో విడిపోయిన తల్లిని చూడగానే ఫాతిమా,నాజియా చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. ఆనందబాష్పాలు పొంగిపొరలాయి. ఇన్ని రోజులకు తమ తల్లిని కలుసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు నజియా పిల్లలు. నజియాను కలుసుకోవడంలో తమకు సహకరించిన హైదరాబాద్‌ పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నాజియాను వెదకడం కోసం హైదరాబాద్‌ పోలీసులు చేసిన కృషిని అందరూ కొనియాడుతున్నారు. పౌరుల భద్రతే కాదు.. ఇలాంటి అరుదైన సందర్భాల్లోనూ రాష్ట్ర పోలీసులు ప్రజలకు అండగా ఉంటూ.. నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిర్వచనంగా మారారని అభినందిస్తున్నారు.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
సల్మాన్ ఖాన్ నిర్దోషి
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ఆటలా..? యుద్ధమా..?
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
వంద, యాభై నోట్లు ఉంటాయా?
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు

Comments

comments