అతి పెద్ద కుంభకోణం ఇదే

Demonetisation is the biggest scam in India

మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అయితే పార్లమెంట్ లో అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ఇప్పటికే అన్ని రకాలుగా ప్లాన్ చేసిన కాంగ్రెస్ తాజాగా బయట కూడా మోదీని ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం మోదీ సర్కార్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుతో పేదలు అష్టకష్టాలు పడుతున్నారని.. ఇది కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయమన్నారు చిదంబరం.

నోట్ల సంక్షోభం నుంచి బయటపడటానికి 7 నెలలు సమయం  పడుతుందన్నారు. ఆర్థికవేత్తలు ఈ చర్యను తప్పుపడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.  నోట్ల కోసం క్యూల్లో నిలుచుని ఇప్పటి వరకు 90 మంది చనిపోయారని తెలిపారు. 2016లో అతిపెద్ద స్కామ్ నోట్ల రద్దే అన్నారాయన. కొత్త నోట్లు లీక్ అయ్యాయి. కర్ణాటక, ఏపీలలో దొరుకుతున్న 2000 నోట్లే దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు.

తిరుమలలో ఏ బ్యాంక్ లోకానీ, ఏటీయంలో కానీ డబ్బులే లేవు. నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయని చిదంబరం అన్నారు. బ్లాక్ మనీ, క్యాష్ లెస్ ఎకనమీ అంటూ మోడీ సర్కార్ పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.  పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అతి పెద్ద దెబ్బ రైతులకే అని చిదంబరం వివరించారు. కరెంట్.. ఇంటర్నెట్ లేని చోట క్యాష్ లెస్ ఎకనమీ సాధ్యమేనా అని మోదీని సూటిగా ప్రశ్నించారు. మోడీ సర్కార్ పేదలపై దాడి చేస్తోందని, 15 లక్షల 44 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు తిరిగొస్తే… పేదోడు ఏం చేస్తాడు? అని అన్నారు. పెద్ద పెద్ద వాళ్ల దగ్గర కొత్త నోట్లు ఉన్నాయి. … రోజూ వారీ కూలీ మీద ఆధారపడుతున్న 45 కోట్ల ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో అవినీతిని ఆపగలిగారా… బ్లాక్ మనీని అరికట్టగలిగారా.. టెర్రరిస్టులకు వచ్చే డబ్బులను అడ్డుకున్నారా అని అన్నారు.దేశాన్ని గందరగోళం పరిచేశారు… జీడీపీపై ప్రభావం చూపుతుంది అని వివరించారు.

Related posts:
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
తాగుబోతుల తెలంగాణ!
ఆరిపోయే దీపంలా టిడిపి?
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
వాళ్లను వదిలేదిలేదు
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
సదావర్తి సత్రం షాకిచ్చింది
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
ఛాయ్‌వాలా@400కోట్లు
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు

Comments

comments