చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?

Did Chandrababu target Temples

చంద్రబాబు నాయుడు నిజానికి ఏ పని చేసినా కూడా అది తిరిగి తిరిగి ప్రభుత్వానికి చెడ్డపేరే తీసుకువస్తోంది. తాజాగా విజయవాడలో గుడుల వ్యవహారం తారా స్థాయికి చేరింది. బెజవాడలో ఎంతో పాతకాలం నాటి గుళ్లను కూల్చివెయ్యడంతో పాటు గుళ్లోని విగ్రహాలను రోడ్డున వదిలెయ్యడం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. అందుకే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా మాత్రం దీనిపై చాలా జాగ్రత్తగా వార్తలు ప్రచురిస్తోంది. మొత్తానికి అధికారపక్షం చేస్తున్న పాపం అని ప్రతిపక్షాలు అంటుంటే.. కాదు కాదు ఓ అధికారి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం అని అదికారపక్ష వాదిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు స్వాముల గుడి కూల్చివేత వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది.

అభివృద్ది పనులకు అడ్డుగా ఉంటే ఏ ప్రార్థనా స్థలాన్నైనా కూల్చవచ్చు అని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. అది వాస్తవమే జనాలకు మేలు చేస్తుంది అంటే మందిరాలను కూల్చివెయ్యడంలో తప్పులేదు. అలాగే పురాతన కాలం నాటివి, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న వాటిని మాత్రం కూల్చడానికి వీలు లేదు అని స్పష్టం చేసింది. ఐతే ఇక్కడ ఓ లాజిక్ఉంది. ఆలయాల కూల్చివేత అనేది ఎలాంటి ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే చెయ్యాల్సిన పని.. పైగా స్థానికంగా అక్కడి వారితో చర్చించిన తర్వాత చేపట్టాల్సిన పని.కానీ విజయవాడలో వరుసగా దేవాలయాల కూల్చివేతకు అక్కడి అధికారులు చూపించిన అత్యూత్సాహం చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది.

ఆలయాల కూల్చివేతను వచ్చిన అధికారుల బృందం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.దేవాలయాలను కూల్చి వేసే టైంలో అధికారులు చాలా నిర్లక్షంగా వ్యవహరించారు. దాంతో గుళ్లను ఇష్టారాజ్యంగా కూల్చివేసి.. చివరకు విగ్రహాలను కూడా రోడ్డు మీదే వదిలేశారు. దాంతో స్థానికులకు కోపం కట్టలు తెంచుకుంది. పైగా ఇది ఓ వర్గానికి చెందిన వారి వ్యవహారం కాబట్టి వెంటనే రాజకీయాలు మొదలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన బిజెపి నాయకులు చంద్రబాబు సర్కార్ మీద నిప్పులు చెరిగారు.

బిజెపి నాయకులు కావాలనే దీనిపై రాద్దాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని టిడిపి నాయకులు అనడం చాలా విడ్డూరం. పైగా దీనిపై కాస్త జాగ్రత్తగా ప్రకటన చెయ్యాల్సిన అధికారపక్షం వాళ్లు ఇలా ప్రకటనలు చెయ్యడం ప్రతిపక్షాలకు అవకాశాన్ని, ఓ వర్గానికి కోపాన్ని తెప్పిస్తోంది. పైగా ఓ అధికారి నిర్వాకం వల్ల ఇలా జరిగింది.. కావాలంటే నష్టపరిహారం కట్టిస్తామని వచ్చిన అమాత్యులు అనడంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారట.గుడి, గుడిలో దేవుడికే మీరు నష్టపరిహారం ఇస్తారా అని వెంటనే ప్రశ్నించారట.

విజ‌య‌వాడలో దేవాల‌యాల కూల్చివేత ఘ‌ట‌న ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో వేడిని పెంచింది. మిగ‌తా విష‌యాల మాదిరిగానే దీన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు అనుకున్న చంద్ర‌బాబు అంచానాలు దారుణంగా త‌ప్పాయి. దేవాల‌యాల కూల్చివేత విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న బీజేపీ, తెలుగుదేశంపై విరుచుకుప‌డింది. ఏపీ బీజేపీ నేత‌లు ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు విష‌యాన్ని హైలెట్ చేయ‌డంలోనూ విజ‌యం సాధించారు. దీంతో పాటు గుళ్ల కూల్చివేత‌ను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ల‌డంలోనూ ఏపీ బీజేపీ వ‌ర్గాలు దూకుడును ప్ర‌ద‌ర్శించాయి.

ఈ ఘ‌ట‌నపై ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు, న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు చంద్ర‌బాబు ఇప్ప‌టికే రంగంలోకి దిగారు. దేవాల‌యాల కూల్చివేత వివాదంపై ఐదుగురు మంత్రుల‌తో ఒక క‌మిటీని నియ‌మించారు. ఈ క‌మిటీలో మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, ప్ర‌త్తిపాటి పుల్లారావు, కొల్లు ర‌వీంద్ర లు ఉన్నారు. వినాయ‌క గుడిని, విజ‌యేశ్వ‌ర‌స్వామి దేవాల‌యాల‌ను అంగుళం కూడా క‌దిలించ‌మ‌ని క‌మిటీ స‌భ్యులు చెప్పారు. కూల్చిన ఆల‌యాల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా తిరిగి నిర్మిస్తామ‌ని వెల్ల‌డించారు. మ‌రోవైపు ఈ క‌మిటీతో విభేధించి ఎంపీ కేశినేని నాని స‌మావేశంలో మ‌ధ్యలోంచి వెళ్లిపోవ‌డం ఆస‌క్తిక‌రం.

వ్యక్తిగత అజెండాతో కొందరు స్వార్థ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. స్వార్థమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆలయాల సంరక్షణ తమ బాధ్యత అన్నారు. విగ్రహాల ధ్వంసం సరైంది కాదన్నారు. పుష్కరాల అభివృద్ధి కోసమే కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని చెప్పారు. గోశాలను ఇస్కాన్ ఆలయం తరహాలో తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పారు. చారిత్రక ఆలయాలను పరిరక్షిస్తామన్నారు. మొత్తానికి అన్ని వెరసి చంద్రబాబు నాయుడు సర్కార్ కు మాత్రం గుదిబండగా మారింది. అనుకోకుండా జరిగిందో.. కావాలనే చంద్రబాబు నాయుడు దేవాలయాలను టార్గెట్ గా చేశాడో.. ఆ దేవుడికే తెలియాలి.

Related posts:
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments