మూడింటికి తేడా ఏంటి..?

package

After Central Finance Minister Arujn Jaitley announce speical package to state of Andhra Pradesh. Most of the people dont know Differece between Special status, special package, special assistance measure.

ఏపికి  కేంద్రం ప్రత్యేక సహాయాన్ని ప్రకటించేసింది. మొన్నటిదాకా నాన్చిన ప్రత్యేక హోదాని వదిలేసి ఏపిని కేంద్రం ప్యాకేజీ అని సహాయం అని మాయ మాటలతో నట్టేట ముంచింది.  మన నాయకులు ముందు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం అని అన్నారు.. కానీ కేంద్రం ప్రకటనతో ఒక్కసారిగా ప్యాకేజీ మీద మాట్లాడుతున్నారు. ఇక ఈ రెండింటి తర్వాత ఉన్న ప్రత్యేక సహాయం గురించి మాత్రం ఎవరూ చర్చించడం లేదు. అసలు ఈ మూడింటికి తేడా ఏంటి..? ప్రశ్నించాలనుకున్న వారికి, తెలుసుకోవాలనుకున్న వారికి ఈ తేడాలేంటొ తెలుసా..? తెలుగోడ ఈ మూడింటి మధ్యన ఉన్న తేడాలను వివరిస్తూ ఈ ఆర్టికల్ ప్రజెంట్ చేస్తోంది.

ప్రత్యేక హోదా
– ఒక రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్రం ప్రత్యేక హోదాని ఇస్తుంది. దీని ప్రకారం కేంద్రం ఆ రాష్ట్రానికి(లేదా కేంద్రపాలిత ప్రాంతానికి) ప్రత్యేక రాయితీలనిస్తుంది.
– కేంద్రం లోటు బడ్జెట్ ను పూడుస్తుంది.
– పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుల మీద, పరిశ్రమలపైన పన్ను రాయితీ ఉంటుంది.
– కేంద్రం బడ్జెట్ లో ప్రత్యేక హోదా కలిగిన వాటికి సహాయం కింద ప్రత్యేక నిధులను కేటాయిస్తుంది.
– రాష్ట్రానికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చెయ్యాల్సిన సహాయాన్ని ప్రత్యేక హోదా పేరుతో కేంద్రం చేస్తుంది.
– ఇప్పటికే దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా గుర్తింపు ఉంది.

ప్రత్యేక ప్యాకేజీ
– ప్రత్యేక కారణాలతో(ఎన్నికల టైంలో రాజకీయ కారణాలు కూడా కావచ్చు) కేంద్రం డైరెక్ట్ గా నిధుల సహాయం చెయ్యడమే ప్రత్యేక ప్యాకేజీ.
– దీని ప్రకారం కేంద్రం ఓ రాష్ట్రానికి నిర్దిష్టమైన నిధులతో కూడిన ప్యాకేజీని కల్పిస్తుంది.
– ఒకవేళ ప్యాకేజీ ముగిస్తే మాత్రం అంతే సంగతులు తర్వాత కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందేపరిస్థితి ఉండదు.

ప్రత్యేక సహాయం
– ప్రత్యేక సహాయం కొన్ని లక్ష్యాలతో కూడుకొని ఉంటుంది. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడమే Special Assistance Mesure ఉద్దేశ్యం.
– రాష్ట్రానికి సంబందించిన ప్రత్యేకంగా ఒక క్యాటగిరీకి చెందిన వాటిలో కేంద్రం సహాయం చేస్తుంది. (వెనుకడిన జిల్లాలు కావచ్చు లేదా – పరిశ్రమలు కావచ్చు లేదా ఎడ్యుకేషనల్ హబ్స్ లాంటి వాటికి కేంద్రం ప్రత్యేక నిధులు సహాయం చెయ్యవచ్చు)
– పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్రం పన్ను రాయితీలతో వెసలుబాటు కల్పిస్తుంది.
– సహాయం అనేది ఎన్ని సంవత్సరాలైనా కానీ రాష్ట్రం ఆ రంగంలో నిలదొక్కుకునేంత వరకు కేంద్రం చేస్తూనే ఉంటుంది.
– వెనకబడిన జిల్లాల దగ్గరి నుండి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వరకు కేంద్రం అన్నింటా రాష్ట్రానికి సహాయం చేస్తుంది.

ఏపికి కేంద్రం చేస్తున్న ప్రత్యేక సహాయం ప్యాకేజీ కంటే మేలు చేసేదే అని చెప్పవచ్చు. కానీ ఏ రకంగానూ ప్రత్యేక హోదాకు సరితూగదు. ఎందుకంటే ప్రత్యేక హోదాతో అవధులులేని అవకాశాలతో మిగితా రాష్ట్రాలతో పోటీపడి ఏపి ఎదగ్గలుగుతుంది. అంతే కాకుండా లోటు బడ్జెట్ నుండి బయటపడగలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రత్యేక సహాయం అనేది ప్రత్యేక హోదాలో ఓ భాగం మాత్రమే.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
జీఎస్టీ బిల్ కథ..
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
వెనకడుగు
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
మెరుపు దాడి... నిజమా-కాదా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
జగన్ క్రిస్టియన్ కాదా!
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?

Comments

comments