ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?

Do u Know What is the Brexit

యూరోపియన్ యూనియన్ అనే ఓ కూటమి నుండి బ్రిటన్ వైదొలగడం అనే కీలక అంశం ఇప్పుడు ప్రపంచానికి వణుకుపుట్టిస్తోంది. ముఖ్యంగా ఎకనామికల్ యాక్టివిటీవ్‌తో ముడిపడిన ఈ అంశంపై యావత్ ప్రపంచం తీక్షణంగా చూస్తోంది. బ్రిటన్ ఈయూ నుండి వైదొలిగితే నష్టం కలుగుతుందని.. ప్రయాణించే విమానంలోనుండి దూకినట్లే అని, తిరిగి విమానంలోకి ఎక్కడం కష్టసాధ్యం అని బ్రిటన్ ప్రధాని కెమరూన్ వ్యాఖ్యానించడం చూస్తే మ్యాటర్ ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది.

బ్రిగ్జిట్ అంటే..
బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగడాన్ని (ఎగ్జిట్) షార్ట్ గా బ్రిగ్జిట్ అని వ్యవహరిస్తున్నారు. 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. 3.35 కోట్ల మంది బ్రిటన్ పౌరులు ఓటింగులో పాల్గొన్నారు. వాళ్లలో ఈయూ నుంచి బయటకు వచ్చేద్దామని 1,74,10,742 మంది అభిప్రాయపడితే, కలిసుందామని 1,61,41,241 మంది అన్నారు. దాంతో 51.9 శాతం ఓట్లతో విడిపోవాలన్న తుది నిర్ణయానికి వచ్చారు. కలిసుందామని చెప్పినవాళ్లు 48.1 శాతం మంది మాత్రమే ఉన్నారు. యూరోపియ‌న్ యూనియ‌న్‌లో క‌లిసి కాపురం చేయ‌లేమ‌ని బ్రిట‌న్ వాసులు తేల్చేశారు.

ఎందుకు:
యూరోపియన్ యూనియన్ లో వివిధ దేశాలకి చెందిన వారు ఏ దేశంలోనైనా స్వేచ్చగా ఉద్యోగం చేసుకోవచ్చు. స్థిరపడవచ్చు. స్థానిక ప్రజలతో సమానంగా అన్ని హక్కులు, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, సంక్షేమ పధకాలను పొందవచ్చు. అంతే కాదు వారికి బ్రిటన్ పౌరులతో సమానంగా ఓటు హక్కు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇబ్బంది అంతా ఈయూ వల్ల బ్రిటన్ కు వచ్చిందేమీ లేదు అనే భావన. ఎందుకు అంటే బ్రిటన్ ఏ వ్యాపారం చెయ్యాలన్నా, ఏ సంస్కరణలు తీసుకురావాలన్నా కూడా ఈయూ అనుమతి తీసుకోవాల్సిందే.

యూరోపియన్ యూనియన్ లో ఉన్న పేద దేశాలలో ప్రజలు సహజంగానే మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్ధికంగా బలంగా ఉన్న బ్రిటన్ కి బారీగా తరలివస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం బ్రిటన్ లోకి ఆవిధంగా వచ్చినవారి సంఖ్య 14 లక్షలని తేలింది. అంటే 14లక్షల మంది బ్రిటన్ యువత ఉద్యోగాలు కోల్పోయారన్న మాట. యూరపియన్ యూనియన్ లో సభ్యులుగా ఉన్న బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర అభివృద్ధి చెందిన దేశాలు, యూరోప్ లో పేద దేశాల అభివృద్ధి కోసం ప్రతీ ఏటా భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. వాటిలో బ్రిటన్ ఆర్ధికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే బ్రిటన్ వాటాగా చాలా ఎక్కువ చెల్లించవలసి వస్తోంది. ఇలా బ్రిటన్ చాలా కారణాలతో ఈయూ నుండి వైదలగాలనే దానికి ఊతం లభించింది.

ఇక నిన్నటి దాకా కలిసి ఉన్నాం.. ఇప్పుడు అతి కీలకంగా ఉన్న దేశంగా మీరున్నారు. మరి మీరు వెళ్లిపోతే ఎలా అంటూ ఈయూ చాలా రకాలుగా రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా కూడా అది కుదరలేదు. దాంతో జనాల్లోకి రెఫరెండంతో ముందుకు వెళ్లింది అక్కడి ప్రభుత్వం. కాగా బ్రెగ్జిట్‌ ఫలితాలు బ్రిటన్‌ ప్రధాని కామెరున్‌ పదవికి ఎసరు పెట్టాయి. కామెరున్ అభీష్టానికి వ్యతిరేకంగా రెఫరెండంలో జనం ఓటు వేయటంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. రెఫరెండం ఫలితాల తర్వాత ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఐతే, అక్టోబర్‌ వరకు పదవిలో కొనసాగి… ఆ తర్వాత ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని కామెరున్ స్పష్టం చేశారు. ఈ తీర్పును అమలు చేయటం తనకు కష్టమని, దేశానికి కొత్త ప్రధాని వచ్చాక ఈ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.

మార్కెట్లకు బ్లాక్ డే:
బ్రెగ్జిట్‌ ఫలితాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బ్రిటన్‌ వాసులు ఎగ్జిట్‌కే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతనమవుతున్నాయి. పౌండ్‌ మారకం విలువ 31 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే స్టాక్‌మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. 750 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 250 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 900 పాయింట్లు నష్టపోయింది. జపాన్ నిక్కీ ఫ్యూచర్స్ శుక్రవారం ట్రేడింగ్‌కు కాస్త విరామం ఇచ్చింది. నిక్కీ స్టాక్ ఇండెక్స్ ఆ తర్వాత 8 శాతానికి పైగా నేల చూపులు చూసింది. బ్రెగ్జిట్ ఖాయమనే వార్తలు వస్తుండటంతో పౌండ్ 1.33 డాలర్లు నష్టపోయింది.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
గెలిచి ఓడిన రోహిత్ వేముల
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
అమ్మను పంపించేశారా?
ఆయన మాట్లాడితే భూకంపం
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..

Comments

comments